కాంగ్రెస్ ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Read Also: Airport Directors: మరో రెండు రోజులు ఢిల్లీ కి ఇండిగో సేవలు ఉండవు
అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా సోనియా
1946 డిసెంబర్ 9న ఇటలీలో జన్మించిన సోనియా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. రాజీవ్ మరణానంతరం ఆమె భారత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. 1998లో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆమె, తన నాయకత్వ పటిమతో పార్టీకి కొత్త ఊపిరి పోశారు.
ఆమె సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు (2004, 2009) కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒకానొక దశలో దేశంలోని 16 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. వయసు, ఆరోగ్య కారణాల దృష్ట్యా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సోనియా గాంధీ, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్‌కు మార్గనిర్దేశం చేస్తూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: