ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో భూకుంభకోణం ఆరోపణలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) కుమారుడిపై వచ్చిన భూ వివాదం ఇంకా సద్దుమణగక ముందే, తాజాగా రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్‌నాయక్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. దాదాపు రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ. 3 కోట్లకే దక్కించుకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
Read Also: Bihar Elections: ఎన్డీఏ కి మద్దతుగా బీహార్ లో నారా లోకేష్ ప్రచారం

కాంగ్రెస్ నాయకుడి ఆరోపణ
ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ్ వడెట్టివార్ విలేకరుల సమావేశంలో చేశారు. ప్రతాప్ సర్‌నాయక్(Pratap Sarnaik) మీరా భయాందర్ ప్రాంతంలో దాదాపు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారని, ఆ స్థలంలో ఆయన ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసినట్లు వడెట్టివార్ తెలిపారు.
రెవెన్యూ మంత్రి స్పందన, అజిత్ పవార్ కేసు
ఈ ఆరోపణలపై మహారాష్ట్ర రెవెన్యూమంత్రి చంద్రశేఖర్ బవాంకులే స్పందించారు. ఈ విషయం గురించి తాను విన్నానని, అయితే దీనిపై తమకు ఎవరి దగ్గరి నుంచి అధికారిక ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడం మానేసి, మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. భూమికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు అందితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్‌కు చెందిన సంస్థకు కూడా రూ. 18,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రూ. 300 కోట్లకే విక్రయించినట్లు కాంగ్రెస్ గతంలో ఆరోపించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ అంశంపై దర్యాప్తునకు బృందాన్ని ఏర్పాటు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: