ఢిల్లీలో జీవించేందుకు అనుకూలంగా ఉండడం లేదు. రోజురోజుకు అక్కడ కాలుష్యం పెరిగిపోతున్నది. దేశరాజధాని పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా నగరాల పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో అనే ఆందోళన పట్టణ, నగరవాసులను పీడిస్తున్న సమస్య. తాజాగా శీతాకాలం ఆరంభం కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Pollution) సమస్య మరింత తీవ్రమైంది. శీతాకాలం కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. కాలుష్య కారక సూక్ష్మ దూళికణాల స్థాయిలు పెరుగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విశ్లేషణలో తేలింది.
Read Also: TG Elections: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల

దీంతో ఢిల్లీ (Delhi) అంతటా కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తున్నట్లు వాయునాణ్యత నిర్వహణ కమిషన్ ప్రకటించింది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయుల్లో క్షీణిస్తుండడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-3ని అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఏముంటాయంటే.. కాలుష్యం అధికంగా ఉన్న ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ వంటి ప్రాంతాలను గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) తక్కువగా ఉన్న నగరాలుగా గుర్తిస్తారు. ఈ సందర్భంగా 5వ తరగతిలోపు ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసివేశారు. అనవసర నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధించారు.
వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 300 నుంచి 400లు దాటడంతో విషవాయువుల ప్రభావం అక్కడి ప్రజలపై ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. నగర ప్రజలు గొంతు, తలనొప్పి, కళ్లు మంటలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో వాయు కాలుష్యం మరింత పెరగకుండా నిరోధించేందుకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో చర్యలు చేపట్టింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: