దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎల్ వోసి తంగర్ లో భారత సైన్యం ఘనంగా వేడుకలు నిర్వహించింది. త్రివర్ణ పతాకానికి ఆర్మీ జవాన్లు సెల్యూట్ చేశారు. భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు త్రివిధ దళాల వందనం స్వీకరించారు.
ఎర్రకోట నుంచి మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు
ఆపరేషన్ సిందూర్ హీరోలకు మోదీ (Narendra Modi) సెల్యూట్ ఎంతోమంది త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మనం నేడు ఎంతో స్వేచ్ఛగా, శాంతియుతంగా జీవిస్తున్నాం అంటే అందుకు ఎంతోమంది ప్రాణాలను అర్పించి, అమరులయ్యారని మోదీ పేర్కొన్నారు. అంతమాత్రమే కాక ఆపరేషన్ సిందూర్ హీరోలకు మోదీ ప్రత్యేక సెల్యూట్ చేశారు. పహల్గాంలో భార్యల కళ్లముందే భర్తలను చంపారన్నారు. ఆపరేషన్ సిందూర్లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామన్న మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు ఈ సందర్భంగా మోదీ సైనికులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.