ప్రధాని నరేంద్ర మోదీ తన 75వ పుట్టిన రోజును ప్రజల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో జరపనున్నారు. మహిళలు మరియు చిన్నారుల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి, “స్వస్త్ నారి – సశక్త్ పరివార్ అభియాన్” అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడి
ఈ కీలకమైన సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) తన ‘ఎక్స్’ ( Twitter) ఖాతాలో ప్రకటించారు. ప్రధాని మోదీ సెప్టెంబర్ 17న ఈ యోజనను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
75,000 ఆరోగ్య శిబిరాలు దేశవ్యాప్తంగా
ఈ అభియాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 75,000 ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరాలు మహిళలు మరియు పిల్లల ఆరోగ్య సంబంధిత అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి.
పోషణ్ మాహ్ ద్వారా సమగ్ర ఆరోగ్య అవగాహన
ఈ కార్యక్రమానికి తోడుగా, పోషణ్ మాహ్ (Poshan Mah)అనే కార్యక్రమం కూడా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలవుతుంది. దీని ద్వారా పోషకాహారం, ఆరోగ్య అవగాహన, మరియు కుటుంబ శ్రేయస్సును ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉంటుంది. ఈ జన్ భాగిదారీ అభియాన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు కూడా భాగస్వాములవ్వాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. “ఇండియా ఫస్ట్” స్ఫూర్తితో వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
read hindi news hindi.vaartha.com
Read also