మలయాళ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan) మరో అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi biopic) జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో ఆయన ప్రధాన పాత్ర పోషించబోతున్నాడు. ఈ చిత్రాన్ని అన్ని భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ‘మా వందే’ (Maa Vande title) అనే శీర్షికను ఖరారు చేశారు.
ప్రధాని మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రకటించడం విశేషం. ఉన్ని ముకుందన్ తన సోషల్ మీడియా (Social media) ప్లాట్‌ఫారమ్‌లలో ఈ విషయాన్ని పంచుకుంటూ, “దేశ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన నాయకుడి జీవితం పోషించే అవకాశం రావడం గర్వకారణం” అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మోదీ గారి జీవితంలోని విభిన్న పార్శ్వాలు, పోరాటాలు, కష్టసుఖాలు ప్రేక్షకులకు చేరువ అవుతాయని ఆయన తెలిపారు.
మోదీపై తనకు ప్రత్యేక అభిమానం కలిగినట్లు
అహ్మాద్‌బాద్ (Ahmedabad) లోనే పెరిగానని, తన చిన్నతనంలో మోదీని సీఎంగా చూశానని, ఆ తర్వాత 2023 ఏప్రిల్‌లో ఆయన్ను వ్యక్తిగతంగా కలుసుకున్నానని, ఆ సమయంలో మోదీపై తనకు ప్రత్యేక అభిమానం కలిగినట్లు ముకుందన్ తెలిపారు. ఓ నటుడిగా ప్రధాని మోదీ పాత్రను పోషించడం పట్ల సంతోషంగా ఫీలవుతున్నానని, ఇది చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉందన్నారు.
ప్రధాని మోదీ రాజకీయ జీవితం అసాధారణముగా, సాగిందని, అయితే తాము తీయబోయే సినిమాలో మోదీని మరో కోణంలో చూపిస్తామని, తన మాతృమూర్తితో ఉన్న అనుబంధాన్ని ఆ ఫిల్మ్‌లో ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు నటుడు ఉన్ని ముకుందన్ తెలిపారు. ఎవరి ముందు తలవంచవద్దు అని గుజరాతీ (Gujarati) లో మోదీ చెప్పేవారని ఆయన గుర్తు చేశారు. ప్రధాన భాషల్లో మా వందే సినిమాను తీస్తామని, ఆ తర్వాత దాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌చేయనున్నట్లు ఆయన చెప్పారు. మోదీ బర్త్‌డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: