కేంద్ర ప్రభుత్వం(Government) రైతుల ఆర్థిక మద్దతును పెంచేందుకు అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఇప్పటి వరకు 21 విడతల ద్వారా కోట్లాది రైతులకు(PM Kisan) సాయం అందించింది. ఇప్పుడు రైతులు 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన లేదు కానీ గత విడతల ట్రెండ్ ప్రకారం, ఫిబ్రవరి 2026లో నిధులు రైతుల ఖాతాల్లో జమ అవ్వే అవకాశం ఉంది. అయితే, డబ్బులు సజావుగా రావడానికి రైతులు కొన్ని ముఖ్యమైన పనులను గడువులో పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే, వారి పేర్లు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించబడే ప్రమాదం ఉంది.
Read also: భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

నిధులు పొందడానికి చేయాల్సిన ముఖ్యమైన పనులు
నిధులు(PM Kisan) ఆగిపోకుండా ఉండాలంటే చేయాల్సిన 3 పనులు.. చాలా మంది రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, చిన్న చిన్న పొరపాట్ల వల్ల డబ్బులు కోల్పోతున్నారు. మీ డబ్బులు ఆగకూడదంటే ఇవి చెక్ చేసుకోండి:
1. ఇ-కేవైసీ (e-KYC) తప్పనిసరి పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా ఇ-కేవైసీ(eKYC)ని పూర్తి చేయాలి. మీరు స్వయంగా (pmkisan.gov.in)పోర్టల్‌కు వెళ్లి ఓటీపీ (OTP) ద్వారా దీనిని పూర్తి చేయవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌లో సాధ్యం కాకపోతే.. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయండి.
2. ఆధార్ – బ్యాంక్ ఖాతా లింక్ & DBT డబ్బులు నేరుగా మీ ఖాతాలో పడాలంటే మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. అలాగే మీ ఖాతాలో DBT ఆప్షన్ ఎనేబుల్ అయిందో లేదో మీ బ్యాంకుకు వెళ్లి సరిచూసుకోండి.
3. దరఖాస్తులో తప్పుల సవరణ
దరఖాస్తు చేసే సమయంలో పేరు స్పెల్లింగ్, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా భూమి వివరాలలో ఏవైనా చిన్న తప్పులు ఉన్నా మీ 22వ విడత ఆగిపోవచ్చు. వెంటనే మీ స్టేటస్ చెక్ చేసుకుని, ఏవైనా తప్పులు ఉంటే పోర్టల్‌లో సరిదిద్దుకోండి.
మీ పేరు జాబితాలో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి..
మీరు 22వ విడతకు అర్హులో కాదో తెలుసుకోవడానికి ఈ క్రింది పద్ధతిని అనుసరించండి.. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ‘Beneficiary Status’ విభాగంపై క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ‘Get Data’ పై క్లిక్ చేస్తే మీ పేమెంట్ స్టేటస్ క్లియర్ గా కనిపిస్తుంది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 6,000లను మూడు విడతల్లో (రూ. 2,000 చొప్పున) నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. వ్యవసాయ ఖర్చుల కోసం రైతులు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ సాయం అందిస్తోంది. కాబట్టి పైన చెప్పిన పనులను వెంటనే పూర్తి చేసి.. 22వ విడత నిధులను పొందేందుకు సిద్ధంగా ఉండండి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: