మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు ఐదుగురు విమాన ప్రమాదంలో మృతి చెందడం కలకలం సృష్టించింది. (Plane Crash) అజిత్ పవార్ మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్టు చేశారు. బారామతిలో ఓ సభకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అజిత్ పవార్‌పై దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం అజిత్ పవార్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) షేర్ చేసి ఎక్స్‌లో భావోద్వేగ పోస్టు పెట్టారు.
Read Also: Plane Crash: అజిత్ పవార్ మృతిపై ప్రముఖులు సంతాపం
అజిత్ పవార్ మృతిపై పవన్ దిగ్భ్రాంతి
ఎన్‌సీపీ అధ్యక్షులు, ఎన్‌డీఏ కూటమి నాయకులైన అజిత్ దాదా పవార్ ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో (Plane Crash) మరణించారనే విషాద వార్త విని నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన అంకితభావంతో చేసిన ప్రజా సేవ, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఆయన అందించిన అపారమైన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను నిరంతరం గౌరవంతో స్మరించుకుంటారు. ఆయన మరణం పట్ల నేను ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ తీవ్ర దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్టు పెట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: