ఉద్యోగం వదిలిన వెంటనే 75% పీఎఫ్ ఉపసంహరణకు అనుమతి: కేంద్రం స్పష్టత
ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) తాజా మార్గదర్శకాల్లో భాగంగా, ఉద్యోగం వదిలిన వెంటనే సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్‌లోని(PF)75 శాతం వరకు మొత్తాన్ని ఉపసంహరించుకునే హక్కు కలిగి ఉన్నారు. అంతేకాక, సభ్యుడు 12 నెలలపాటు నిరుద్యోగంగా ఉంటే, తన EPF మొత్తాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు అని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ ప్రకటన సోషల్ మీడియాలో వచ్చే అపవాస్తవ ప్రచారాలకు కేంద్రం ఇచ్చిన ప్రతిస్పందనగా వచ్చింది. ఇటీవల విడుదలైన మార్గదర్శకాల్లో, పీఎఫ్ ఉపసంహరణ కోసం అవసరమయ్యే నిరుద్యోగ సమయం రెండే నెలల నుండి 12 నెలలకు పెరిగిందన్న వార్తలు గందరగోళాన్ని సృష్టించాయి. అయితే, కేంద్రం దాన్ని ఖండించింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం:
- ఒక నెల నిరుద్యోగం తర్వాత – 75% వరకు ఉపసంహరణ
- రెండు నెలల నిరుద్యోగం తర్వాత – 100% వరకు ఉపసంహరణ
పెన్షన్ ఖాతాల విషయంలో మాత్రం కొన్ని కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. పెన్షన్ (Pension) నిధులను పూర్తిగా ఉపసంహరించుకునే అవకాశం ప్రస్తుతం 36 నెలల తర్వాత మాత్రమే వర్తిస్తుంది. అయితే వయో పరిమితి, పదవీ విరమణ, శాశ్వత వైకల్యం వంటి ప్రత్యేక సందర్భాల్లో పూర్తిగా ఉపసంహరణకు అనుమతి ఉంది.
Read also: డిజిటల్ గోల్డ్ కొనుగోలు పై ప్రత్యేక క్యాష్‌బ్యాక్…

పాక్షిక ఉపసంహరణ వర్గాలను 13 నుంచి 3కి తగ్గింపు – కొత్త మార్గదర్శకాలు
EPFO మంగళవారం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, పాక్షిక ఉపసంహరణల వర్గాలను 13 నుంచి కేవలం 3కి తగ్గించారు. ఇది ఉపసంహరణ ప్రక్రియను(PF) సరళీకృతం చేయడమే కాకుండా, పదవీ విరమణ సమయంలో సభ్యులకు మెరుగైన కార్పస్ అందించే ఉద్దేశంతో తీసుకున్న చర్య అని అధికారులు తెలిపారు.
కొత్త మూడు ఉపవర్గాలు:
- ముఖ్య అవసరాలు – వైద్యం, విద్య, వివాహం
- గృహ అవసరాలు – ఇల్లు కొనుగోలు, నిర్మాణం, లోన్ తిరుగుబాటుకు
- ప్రత్యేక పరిస్థితులు – ఇప్పుడు ఈ వర్గంలో సభ్యులు ఎలాంటి కారణం తెలిపకుండానే దరఖాస్తు చేయొచ్చు
ఇకపై సభ్యులు:
- విద్య కోసం 10 సార్లు
- వివాహం కోసం 5 సార్లు
పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. గతంలో అయితే ఈ రెండింటికీ కలిపి గరిష్ఠంగా 3 సార్లు మాత్రమే అనుమతించబడేది.
ఈ మార్పులు ఉద్యోగుల తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా, వారి భవిష్య భద్రతను కాపాడేలా రూపొందించబడ్డాయని EPFO స్పష్టం చేసింది. నిరుద్యోగ సమయంలో 75 శాతం ఉపసంహరణ అవకాశం ఉద్యోగులకు ఆర్థిక ఒత్తిడి తగ్గించే కీలక మార్గం అవుతుంది.
ఉద్యోగం వదిలిన వెంటనే పీఎఫ్ మొత్తాన్ని తీసుకోవచ్చా?
అవును, ఒక్క నెల నిరుద్యోగం తర్వాత 75% వరకు, రెండు నెలల తర్వాత మొత్తం 100% వరకు ఉపసంహరణ చేసుకోవచ్చు.
పెన్షన్ ఖాతాలోని మొత్తాన్ని ఎప్పుడు తీసుకోవచ్చు?
ప్రస్తుతం 36 నెలల తర్వాత మాత్రమే పెన్షన్ ఖాతా ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అది త్వరగా పొందవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :