పార్లమెంటు (Parliament) బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల తొలిరోజున రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తొలిరోజు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న (ఆదివారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ అంచనా రూ.11 లక్షల కోట్లుగా ఉంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందించే అవకాశం ఉంది.
Read also: UP crime: విషపూరితమైన పండ్లు తిని ముగ్గురు చిన్నారులు మృతి

ఉపాధి సృష్టి వంటి అంశాలపై దృష్టి
ప్రతియేటా కేంద్ర ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన సమర్పిస్తారన్న విషయం తెలిసిందే. 2017 నుంచి ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం కొనసాగుతోంది.అయితే, ఈ సారి బడ్జెట్‌లో మధ్యతరగతి, రైతులు, యువత, మహిళలు, వ్యవసాయం, తయారీ రంగాలు, ఉపాధి సృష్టి వంటి అంశాలపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: