నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ కీలక సమావేశాలు ఆరంభం నుంచే వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. అటు ప్రభుత్వం తన అజెండాతో సిద్ధంగా ఉండగా.. ఇటు ప్రతిపక్షాలు వివిధ అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ (Budget 2026) నేపథ్యంలో ఉపాధి హామీ పథకం, విదేశీ విధానం వంటి అంశాలు సభను కుదిపేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం బుధవారం (జనవరి 28) ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. దీంతో బడ్జెట్ సెషన్ అధికారికంగా మొదలవుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి పూర్తిస్థాయి బడ్జెట్ (Budget 2026)ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సెషన్ రెండు విడతలుగా సాగనుంది. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతుంది. మొత్తం 30 సిట్టింగ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
Read Also: Ajit Pawar Death: అజిత్ పవార్ సహా ఆరుగురు దుర్మరణం

ప్రతిపక్షాల వ్యూహం ఇదే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి (INDIA Bloc) ఈసారి ప్రభుత్వాన్ని గట్టిగా ఇరకాటంలో పెట్టాలని నిర్ణయించుకుంది. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ తన వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ప్రధానంగా వీటిపై చర్చకు పట్టుబట్టనున్నారు.. MGNREGA స్థానంలో తెచ్చిన VB-G RAM G చట్టం: ఉపాధి హామీ పథకంలో మార్పులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. విదేశీ విధానం: అమెరికా విధిస్తున్న టారిఫ్లు, పొరుగు దేశాలతో సంబంధాలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని నిర్ణయించాయి. పర్యావరణం & కాలుష్యం: ముఖ్యంగా వాయు కాలుష్యం, లడఖ్, జమ్మూ కాశ్మీర్ సమస్యలను సభలో లేవనెత్తనున్నారు. పట్టువిడవని ప్రభుత్వం.. సభ సాగేనా? సర్వపక్ష సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కోరుతున్న పలు అంశాలపై ఇప్పటికే చర్చ జరిగిందని, మళ్లీ పాత విషయాలపై చర్చ సాధ్యం కాదని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: