పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు(Parenting Tips) ఎన్నో విధానాలను అనుసరిస్తుంటారు. వాటిలో పెరుగుతున్న ఒక పద్ధతి ఎగ్ షెల్ పేరెంటింగ్. ఇందులో పిల్లలను బయట ప్రపంచానికి దూరంగా ఉంచుతూ, ఎక్కడికీ వెళ్లనివ్వకుండా పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. ఇది పిల్లల భద్రత కోసం చేస్తున్నామని భావించినా, దీని ప్రభావాలు మాత్రం ప్రతికూలంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎగ్ షెల్ పేరెంటింగ్ వల్ల ఏమి జరుగుతుంది?

ఇలాంటి పెంపకంలో(Parenting Tips) పెరిగిన పిల్లలు
- ఇతరులతో కలిసిపోవడంలో ఇబ్బంది పడతారు
- కొత్త పరిస్థితులను ఎదుర్కోలేరు
- సమస్యల్ని స్వయంగా పరిష్కరించే నైపుణ్యం అభివృద్ధి చెందదు
- ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది
- తల్లిదండ్రులపై అధికంగా ఆధారపడే స్వభావం పెరుగుతుంది
పిల్లలు బయటకు వెళ్లి స్నేహితులను చేసుకోవడం, ఆటల్లో పాల్గొనడం, చిన్న చిన్న సమస్యలను తమంతట తాము ఎదుర్కోవడం చాలా అవసరం. అవే వారిని బలంగా, ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తులుగా తయారు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల సలహా
పిల్లలను పూర్తిగా ఇల్లు పట్టున పెట్టడం కన్నా, వారి వయస్సుకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలి. సురక్షితమైన హద్దులతో వారిని బయట ప్రపంచాన్ని అనుభవించనివ్వాలి. ఇది వారి వ్యక్తిత్వ వికాసానికి, భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనే శక్తిని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: