గుంతకల్లు రైల్వే: కేంద్రప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) లోక్ సభకు తెలిపారు. సోమవారం తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ (Sri Perambadur) నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న డిఎంకె సభ్యుడు టిఆర్ బాబు, ఉత్తరప్రదేశ్లోని దౌరాహ్ర నుంచి సమాజ్ వాది పార్టీ నుంచి లోక్సభలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఆనంద్ బహదూరియాలు అడిగిన ప్రశ్న (నెంబర్ :150)కు మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) సమాధానమిస్తూ కేంద్రప్రభుత్వం సర్వీసులలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల పెంపుదలకు సంబంధించిన 8వ కేంద్రవేతన సంఘానికి సంబంధించి చైర్పర్సన్, సభ్యులతో ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించినట్లు వెల్లడించారు.
పంకజ్ చౌదరి ఎవరు?
పంకజ్ చౌదరి (జననం 20 నవంబర్ 1964) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం భారత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.
పంకజ్ చౌదరి ఫ్యామిలీ?
భగవతి ప్రసాద్ చౌదరి మరియు ఉజ్వల్ చౌదరి దంపతులకు జన్మించిన ఆయన రాజకీయ నేపథ్యం నుండి వచ్చారు, ఆయన తల్లి ఉజ్వల్ చౌదరి మహారాజ్‌గంజ్ జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా పనిచేశారు. పంకజ్ చౌదరి భాగ్య శ్రీ చౌదరిని వివాహం చేసుకున్నారు, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: IMF: ఐఎంఎఫ్ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్