సీనియర్ సిటిజన్లు, ఎన్‌ఆర్‌ఐలకు పాన్–ఆధార్ మినహాయింపు
పాన్ కార్డ్–ఆధార్(PAN-Aadhaar Link) అనుసంధానంపై ఆదాయపు పన్ను శాఖ స్పష్టత ఇచ్చింది. 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, భారత్ వెలుపల నివసిస్తున్న వ్యక్తులు (NRIs), అలాగే అస్సాం, మేఘాలయ, జమ్మూ–కాశ్మీర్ రాష్ట్రాల్లో నివసించే వారికి పాన్–ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అదేవిధంగా, మరణించిన వ్యక్తులకు కూడా ఈ నిబంధన వర్తించదని పేర్కొంది.
Read also: Car Price: కార్ల ధరల పెంపుకు సిద్ధమైన కంపెనీలు
అయితే, 18 ఏళ్లలోపు మైనర్‌లకు పాన్ కార్డ్ ఉండి, వారి మీద పన్ను బాధ్యత ఉంటే మాత్రం ఆధార్‌తో అనుసంధానం చేయడం తప్పనిసరిగా మారుతుందని స్పష్టం చేసింది. ఉమ్మడి బ్యాంకు ఖాతా ఉన్న కారణంగా ఎటువంటి మినహాయింపులు లభించవని కూడా తెలిపింది.

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్
పాన్–ఆధార్ లింక్ పూర్తి చేయకపోతే పెండింగ్‌లో ఉన్న ఇన్‌కం ట్యాక్స్ రిఫండ్ నిలిపివేయడం, అధికంగా టిడిఎస్ కటింగ్ జరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది.
ఆదాయపు పన్ను శాఖ సూచనల ప్రకారం, పాన్–ఆధార్(Income Tax Department) అనుసంధానం పూర్తిగా చేయని పక్షంలో పాన్ కార్డ్ ఆపరేటివ్‌గా కాకపోయే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో బ్యాంకింగ్ లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, అధిక విలువ గల ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో సాంకేతిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉండటంతో అర్హులైన పన్ను చెల్లింపుదారులు గడువు లోపే తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: