జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ గట్టి ప్రతిస్పందన ఇచ్చింది. పాకిస్తాన్ పౌరుల వీసాలు రద్దు చేయడమే కాక, సింధు జలాల ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్‌లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశాన్ని విడిచిపెట్టాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా మెడికల్ వీసా కలిగిన వారు ఈ నెల 29లోపు వెళ్లిపోవాలని సూచించింది.ఏప్రిల్ 22న పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన భారత్‌ను కుదిపేసింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసర భేటీ నిర్వహించింది. భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య బంధాలు తగ్గించాలని, పాకిస్తాన్ మిలిటరీ అధికారులను బహిష్కరించాలని నిర్ణయించారు.ఇక సార్క్ వీసా మినహాయింపు పథకం కూడా పాక్ పౌరులకు రద్దయింది. మే 1 లోపు చట్టబద్ధంగా తిరిగిపోవాలనుకునే వారిని తప్పించి, మిగిలిన వారందరినీ అట్టారీ సరిహద్దు నుంచి వెనక్కు పంపుతామని భారత్ వెల్లడించింది.

ఈ చర్యలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. గురువారం కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్‌లో KSE 100 సూచీ గణనీయంగా పడిపోయింది. దాదాపు 2 శాతం నష్టంతో మార్కెట్ కుదేలైంది. ఇప్పటికే ఆర్థికంగా కష్టాలు పడుతున్న పాకిస్తాన్‌కు ఇది ఇంకొక దెబ్బే.ఇది అక్కడితో ఆగలేదు. ఉద్రిక్తతలపై స్పందనగా పాకిస్తాన్ కరాచీ తీరంలో క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి.బహుశా షహీన్-III లేదా బాబర్ క్షిపణులే పరీక్షించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి భారత్‌లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం కలిగినవిగా భావిస్తున్నారు.అదే సమయంలో భారత్ కూడా తాము వెనుకపోమన్నట్లు ఐఎన్ఎస్ సూరత్ నుంచి సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇది మీడియం రేంజ్ గైడెడ్ మిస్సైల్ కావడం విశేషం.ఈ పరిణామాలన్నీ పాకిస్తాన్ మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడిని కలిగించాయి. ఆరిఫ్ హబీబ్ లిమిటెడ్‌కు చెందిన నిపుణులు సనా తౌఫిక్ వ్యాఖ్యానిస్తూ – “భారత్ చర్యలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పాకిస్తాన్ వృద్ధిరేటును 3% నుంచి 2.6%కు తగ్గించడమూ ఈ ఒత్తిడికి మరో కారణం” అన్నారు.
Read Also : Prakash Raj : ఇది కశ్మీర్‌పై జరిగిన దాడి : నటుడు ప్రకాశ్ రాజ్