అమాయకులైన చిన్న పిల్లలను పాక్ ఆర్మీ (Pak Army) పొట్టన పెట్టుకుంది. ఆఫ్ఘానిస్తాన్ (Afghanistan) లోని ఖోస్ట్రావిన్స్ పాక్ చేసిన దాడుల్లో ఒక నెల, పదహారు నెలలు ఉన్న పిల్లలు మృతి చెందారు. దీంతో ఆ ప్రావిన్స్ మొత్తం దుఃఖసాగరంలో మునిగిపోయింది. నిన్న అర్థరాత్రి పాక్ సైన్యం ఖోస్ట్రావిన్స్ పై విరుచుకుపడింది. వైమానిక దాడులు చేసింది.
Read Also: Prime Minister: సామాజిక, ఆర్థిక ప్రగతికి విధుల నిర్వహణ కీలకం : ప్రధాని మోదీ
ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది సభ్యులు మరణించారు. వారిలో తొమ్మిది మంది పిల్లలే కావడం గమనార్హం. నిద్రపోతున్న ప్రజలపై పాక్ వైమానిక దాడులు చేసింది. వీరిలో 16నెలల మోహిబుల్లా, 3 ఏళ్ల హోజబుల్లా, 5ఏళ షంసుల్లా, ఎడేళ్ల అసదుల్లా తదితరులు ఉన్నారు. గుర్బుజ్ జిల్లాతో సహా భోస్ట్రావిన్స్ మొత్తం జనాభా సుమారు 648,000.

దాడులతో తమకు సంబంధం లేదు: పాక్
ఈ దాడులు తాము చేయలేదని, ఇందులో తమ ప్రమేయం లేదని పాకిస్తాన్ చెబుతోంది. తాము దాడి చేస్తే ఆ విషయాన్ని ప్రకటిస్తామని పాక్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చెప్పారు. అయితే పాకిస్తాన్ (Pakistan) తాము చేసిన పనిని ఒప్పుకోకపోవడం ఇదేమీ కొత్తకాదు. భారత్ పై చేసిన దాడులపై కూడా ఇలాగే ప్రకటన చేసింది. పైగా భారతే తమపై దాడి చేస్తోందని అహ్మద్ షరీఫ్ అన్నారు. ఇప్పటివరకు పాక్ ఆఫ్ఘానిస్తాన్ పై మూడుసార్లు దాడికి పూనుకుంది. ఈ దాడుల్లో దాదాపు 71 మంది పౌరులు మరణించారు. వీరంతా అమాయకులైన ఆఫ్ఘాన్లు అని ఆదేశ అధికారులు అంటున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: