ఆపరేషన్ సింధూర్‌లో భారత్ ఘాటుగా ప్రతీకారం తీర్చిన తర్వాత పాక్ అధికార ప్రతినిధులు అసత్య ప్రచారాలకు దిగారు. తమ దేశ గగనతలంలోకి వచ్చిన భారత ఆర్మీకి చెందిన రెండు ఫైటర్ జెట్లు, ఒక డ్రోన్‌ను కూల్చేశామని పాక్ రక్షణ మంత్రి ఘనంగా ప్రకటించారు. ఈ ప్రకటన పాక్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం పొందగా, దీనిపై భారత రక్షణ శాఖ క్లారిటీ ఇచ్చింది.
ఒక్క జెట్ కూడా నష్టపోలేదని స్పష్టం
భారత ఆర్మీ అధికారికంగా స్పందిస్తూ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఒక్క జెట్ కూడా నష్టపోలేదని స్పష్టం చేసింది. భారత వైమానిక దళం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఖచ్చితమైన వ్యూహాలతో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని, ఈ ఆపరేషన్ పూర్తిగా విజయవంతమైందని పేర్కొంది. పాక్ చేస్తున్న ఆరోపణలు అసత్యం, పూర్తిగా గాలి ఖబరేనని భారత్ ఖండించింది.
ఫైటర్ జెట్‌ను భారత వాయుసేన కూల్చేసిందన్న వార్తలు మీడియాలో చక్కర్లు
ఇక మరోవైపు, పాకిస్థాన్‌కు చెందిన ఓ ఫైటర్ జెట్‌ను భారత వాయుసేన కూల్చేసిందన్న వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా భారత ఆర్మీ ఇంకా ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా వెలువడిన సమాచారం మేరకు, పాక్ వైమానిక బలగాలకు ఈ దాడి భారీ మానసిక దెబ్బగా నిలిచిందని, అట్టి అసత్య ఆరోపణలతో తమ నైతిక ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also : Operation Sindoor : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే