కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన 25మంది పేర్లను చదువుతున్నప్పుడు లోక్సభలో ఒక్కసారిగా,తీవ్రగందరగోళం ఏర్పడింది. ప్రియాంకగాంధీ మృతులను ‘భారతీయులు’ అని సంబోధించగా, ట్రెచరీ బెంచీలు (అధికారపక్షం వారు)
వారిని ‘హిందువులు” అని నొక్కి చెప్పారు. దీనితో ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా ‘భారతీయులు’ అని అరిచారు. దీనితో సభ ఒక్కసారిగా’హిందూ-భారతీయ’ నినాదాలతో మార్మోగిపోయింది. ‘పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) లో మరణించినవారు కూడా మనలా మనుషులే. వారు ఏదోఒక రాజకీయ క్రీడలో బంటులు కాదు. వారు మన దేశానికి చెందిన బిడ్డలు. వాస్తవానికి వారు కూడా అమరవీరులు. మనందరికీ వారి కుటుంబాల పట్ల బాధ్యత ఉంది. బాధిత కుటుంబాలకు నిజం తెలుసుకునే హక్కు ఉంది’ అని ప్రియాంకగాంధీ పేర్కొన్నారు.
కేంద్రాన్ని పలు ప్రశ్నలు సంధించిన ప్రియాంకగాంధీ
అంతకుముందు పహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్లో,సాధారణ పరిస్థితులు నెలకొంటే పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని అడగారు. ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పై చర్చ సందర్భంగా లోక్ సభలో మాట్లాడిన ఆమె కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు. ‘టీఆర్ఎఫ్ అనేది కొత్తగా రాలేదు. కశ్మీర్ లో పలుచోట్ల దాడులు చేసింది.2024లో టీఆర్ఎఫ్ దాడిలో 9మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. టీఆర్ఎఫ్ వరుసగా దాడులు చేస్తుంటే కేంద్రం ఏంచేస్తున్నట్లు? పహల్గాం ఉగ్రదాడి మన నిఘా సంస్థల వైఫల్యం కాదా? పహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిది? హోంమంత్రి లేదా ఐబీచీఫ్ ఎవరైనా రాజీనామా చేశారా? మణిపూర్లో అల్లర్లకు బాధ్యత ఎవరు అతీసుకుంటారు? ఆపరేషన్ సింధూర్ కు మేమంతాముక్తకంఠంతో మద్దతిచ్చాం. మన సైనికులు ఎంతో ధైర్యసాహసాలతో పోరాడారు.

ఆకట్టుకున్న ప్రియాంక ప్రసంగం
సైనిక బలగాల పోరాటాన్ని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు. పాకిస్థాన్ ఫోన్ చేసి కాళ్లబేరానికి వచ్చిందని అన్నారు. మనదేశంలోకి వచ్చి దాడులు చేసిన వారిని
ఎందుకు క్షమించాలి?’ అని ప్రియాంక ప్రశ్నించారు.ప్రియాంక మాట్లాడుతున్నంతసేపు సభలోశ్రద్ధగా విన్నారు. చిదంబరం కూడా అధికారపార్టీని పలు ప్రశ్నలతో సంధించారు. హఠాత్తుగా కాల్పుల విరమణను ఎందుకుప్రకటించారని ప్రశ్నించారు.
ప్రియాంకా గాంధీ విద్యార్హతలు ఏమిటి?
ఆమె డిల్లీ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీ (మనోవిజ్ఞానం)లో డిగ్రీ, తరువాత బౌద్ధ అధ్యయనాలలో మాస్టర్స్ పూర్తి చేశారు.
ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
1999లో తల్లి సోనియా గాంధీకి ఎన్నికల ప్రచారం చేయడం ద్వారా ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టారు. తరువాత అనేక ఎన్నికల ప్రచారాల్లో కీలక పాత్ర పోషించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Dharamsthala: ధర్మస్థల ఒక్కటే కాదు.. బయటకు రాని అరాచకాలెన్నో..