ఇటీవల సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి నెలకొన్నది. మహిళలు, పిల్లలు వీటివల్ల ఎంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీంతో కేంద్రం దీనిపై దృష్టి సారించింది. తప్పుడు సమాచారం, ఆశ్లీలత, సైబర్ నేరాలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా, (social media) ఒటిటి ప్లాట్ ఫారమ్ లపై కఠినమైన జవాబుదారీతనాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సురక్షితమైన, నమ్మదగిన, జవాబుదారీ ఇంటర్నెట్ ను ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రత కోసం సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐటి చట్టం 200, ఊటీ నియమాలు 2021, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం డిజిటల్ ప్లాట్ ఫారమ్ లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలను పాటించని వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.
Read also: Air Pollution : నగరాన్ని వీడి హిల్ స్టేట్‌కు క్యూకడుతున్న ఢిల్లీ వాసులు?

OTT
సురక్షితమైన సమాచారం అందించడమే లక్ష్యం
భారతదేశంలో బహిరంగ, సురక్షితమైన, విశ్వసనీయమైన సమాచారం అందించడమే తన విధానాల లక్ష్యం అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విధానం ప్రత్యేకంగా మహిళలు, పిల్లలను ఆన్ లైన్ హాని నుండి రక్షించడంపై దృష్టి పెడుతోంది. ఇంటర్నెట్ లో చట్టవిరుద్ధమైన, అశ్లీలమైన లేదా తప్పుదారి పట్టించే కంటెంట్ ప్రసారం కాకుండా చూసుకోవడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా చట్టపరమైన, పరిపాలనాస్థాయిలో చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఐటీ చట్టం 2000, ఐటీ నియమాలు 2021 డిజిటల్ ప్లాట్ ఫామ్ ల బాధ్యతలను నిర్వచిస్తాయి. ఈ చట్టాలు ఆశ్లీల కంటెంట్, గోప్యతా ఉల్లంఘనలు, సైబర్ నేరాలకు శిక్షను అందిస్తాయి. పోలీసులకు దర్యాప్తు, శోధన, అరెస్టు చేయడానికి కూడా అధికారం ఉంది. ఐటీ నియమాలు 2021 చట్టవిరుద్ధమైన కంటెంట్ నేను బ్లాక్ చేయడం, తొలగించడం కంపెనీలను స్పష్టంగా ఆదేశిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: