ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) సమయంలో భారతీయ యుద్ధ విమానాలను కూల్చినట్లు పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను (Pakistan’s allegations)ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కొట్టిపారేశారు. అవన్నీ పాకిస్థాన్ అల్లిన అందమైన కట్టుకథలన్నారు. పాకిస్థాన్ వద్ద యుద్ధ విమానాల కూల్చివేతకు చెందిన ఆధారాలు లేవన్నారు. కానీ ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)సమయంలో పాక్‌లో ఉన్న అనేక స్థావరాలను ఇండియా ధ్వంసం చేసిందని, వాటికి సంబంధించిన చిత్రాలను రిలీజ్ చేసినట్లు ఆయన చెప్పారు. తమ ప్రజల నుంచి రక్షణ పొందేందుకు పాకిస్థాన్ ఆ కథలు అల్లినట్లు ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో అమర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఒకవేళ మన దేశానికి చెందిన 15 యుద్ధ విమానాలను పాకిస్థాన్ కూల్చివేసిందని అనుకుంటే, అలా వాళ్లను అనుకోనివ్వండి అని, వాళ్లు దానిక గురించి కన్విన్స్ అవుతారని, అంటే మన దళంలో 15 యుద్ధ విమానాలు తక్కువ అవుతాయని, అప్పుడు దాని గురించి తాను మాట్లాడాల్సిన అవసరం ఏముందని ఆయన అన్నారు. ఇప్పటికి కూడా ఏం జరిగిందో తానేమీ చెప్పలేనన్నారు. ఎంత నష్టం జరిగింది, ఎలా జరిగిందో తెలియదన్నారు. ఆ అంచనాలన్నీ పాకిస్థాన్ చేయాలన్నారు.

మన ఎయిర్ బేస్‌ల వద్ద ఏదైనా శిథిలం పడినట్లు మీరేమైనా ఫోటోలను చూశారా, ఏదైనా మనల్ని తాకినట్లు గమినించారా, ఏదైనా హ్యాంగర్ ధ్వంసమైందా అని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్‌లో ధ్వంసమైన అనేక ప్రాంతాలకు చెందిన పిక్‌లను చూపించామని, కానీ వాళ్లు మాత్రం ఒక్క పిక్ కూడా మనకు చూపించలేదన్నారు. అంటే వాళ్లు మాట్లాడేది మనోహరమైన కట్టుకథలే అని ఆయన అన్నారు. ఆ కథలతో వాళ్లు సంతోషంగా ఉండనివ్వండి అని, దేశ ప్రజల ముందు వాళ్లు కూడా తమ ముఖాన్ని చూపించాల్సి ఉంటుంది కాబట్టి, దీంట్లో పెద్దగా బాధపడేది ఏమీ లేదన్నారు.
ఆపరేషన్ సిందూర్ అంటే ఏమిటి?
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత, మే 6 మరియు 7 తేదీల మధ్య రాత్రులలో భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది . తక్కువ సమయంలోనే, పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను తటస్థీకరించారు.
ఆపరేషన్ సిందూర్ 2025?
2025 మే 7న, భారతదేశం పాకిస్తాన్‌పై క్షిపణి దాడులను ప్రారంభించింది. దీనికి ఆపరేషన్ సిందూర్ అనే సంకేతనామం ఉంది. భారతదేశం ప్రకారం, క్షిపణి దాడులు జైష్-ఎ-మొహమ్మద్ మరియు లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాద గ్రూపులను లక్ష్యంగా చేసుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: