ఆపరేషన్ సిందూర్
ఆపరేషన్ సిందూర్ వివరాలను బుధవారం న్యూఢిల్లీలో మీడియాకి వెల్లడిస్తున్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ. చిత్రంలో కల్నల్ సోఫియా ఖురేషి, ఐఎఎఫ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. వహల్గాంలో భారత మహిళల సింధూరాన్ని చెరిపేసిన ముష్కరులను అంతంచేసి భారత్ తన ఆయుధ సత్తాను ప్రపంచానికి వాటిచెప్పింది. కేవలం 25 నిమిషాల్లోనే 24 అత్యాధునిక క్షిపణులను ప్రయోగించి పొరుగుదేశం, శతృదేశం అయినా సాధారణ పౌరులకు మాత్రమే నష్టంలేని విధంగా భారత్ తన ఆపరేషన్ సింధూర్ ముగించింది. రాత్రి పొద్దుపోయాక 1.05 నిమిషాలకు ఒక్కసారిగా జరిగిన ఈ ప్రయోగాల్లో మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి. లెక్కలు చెప్పేందుకు సైతం పాక్ వణు కుతున్న వేళ సుమారు 100 మందికిపైగా ఉగ్రవాదులు ఈ దాడిలో హతం అయ్యారు. ఆడబిడ్డ సింధూరాన్ని చెరిపేసిన ముష్కరులకు మహిళా శక్తి ఎలాంటిదో భారత త్రివిధ దళాలు సంయుక్త కార్యాచరణలో చూపించాయి. ప్రధాని మోదీ ఉగ్రమూకలపై అగ్ని వర్షం ఉక్కు సంకల్పంముందు ఉగ్రవాదం విచ్చిన్నం అయింది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలపై విప్లవాత్మక దాడి
గడచిన తొమ్మిదిరోజులుగా ప్రధాని త్రివిధ దళాధిపతులతోపాటు, రక్షణ హోం భద్రతా నలహాదారులతో జరిపిన ఎడతెగని సమావేశాలు కేవలం కార్యరూపంలోకి వచ్చాయి. అర్థగంట సమయంకూడా పట్టకుండానే తమ మొత్తం ఆపరేషన్ పూర్తి చేసి భారత త్రివిధ దళాలు తమ సత్తా ఏంటో కేవలం దాయాదికే కాదు కయ్యానికి కాలు దువ్వుతున్న ఇతర ప్రపంచదేశాలకు కూడా చూపించాయి. నవవధువు హిమాంశు నర్వాల్ సింధూరాన్ని చెరిపేసిన ఉగ్రవాదులను వెంటాడి హతమారుస్తామనిచెప్పినట్లే భారత్ తన శక్తిని చాటిచెప్పింది. అందుకే ఈ దాడులకు ‘ఆపరేషన్ సింధూర్’ అని ప్రధాని స్వయంగా పేరుపెట్టారు. పేలుడు సమీపించిన ప్రాంతంలో ఉగ్రవాదులు భయంతో పరుగులుతీసారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పంజాబ్ ప్రావిన్స్ ల్లో ఉన్న ఉగ్రస్థావరాలను ఏకకాలంలో ధ్వంసంచేసాయి. కేవలం ఉదుల స్థావరాలు, ఉగ్రవాదులే లక్ష్యంగాజరిగిన ఈ దాడుల్లో జైషేముహ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థల స్థావరాలన్నీ కుప్పకూలిపోయాయి. పివోకేలోని ముజఫరాబాద్, కోట్లి, బహవల్పూర్, రావల్కోట; చక్స్వారీ, బీంబర్, నీలం వ్యాలీ, జీలం చక్వాలలోని ఉగ్రవాద కాంప్లెక్స్ లపైనే ఈ దాడులు నిర్వహించింది. భారత కాశ్మీర్ ప్రాంతంలోకి చొరబాట్లను ప్రోత్సహించేందుకు రవాణా లాజిస్టిక్స్ పాయింట్లుగా ముజఫరాబాద్, భీంబర్లను గుర్తించిన భద్రతా దళాలు ఆపరేషన్ సింధూర్లో ధ్వంసంచేసాయి. శిక్షణా శిబిరాలు, గోదాములు, శిక్షణ ఇచ్చే వేదికలు, మొత్తం కూల్చివేసాయి.

భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన ఆపరేషన్ సింధూర్
అయితే పాకిస్థాన్ సైనిక స్థావరాలు టార్గెట్ చేయగలిగే సత్తా ఉన్నా కూడా భారత్ వాటిజోలికి వెళ్లకుండా కేవలం ఉగ్రసంస్థలనే టార్గెట్ గా ఎంచుకుంది. గుల్పూర్ ఉగ్రక్యాంప్ అంతర్జాతీయ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. లష్కరే తాయిబాకు చెందినదని తేల్చారు. ఇక్కడి నుంచే రాజౌరి పూంచ్ ప్రాంతాల్లోకి చొరబడుతున్నట్లు తేలింది. ఈవరంలోనే 2023 2024 పూంచాడుల్లో పాల్గొ ఉగ్రవాదులు శిక్షణపొందారని కూడా భారత్ గుర్తించింది. దాడిచేసిన తొమ్మిది కేంద్రాలు కూడా ఉగ్రవాదులకు స్వర్గధామాలుగా ఉన్నాయి. మర్కజ్ సుభాన్ అల్లాహ్ కేంద్రం భావల్పూర్లో జైషేముహ్మద్ కేంద్ర కార్యాలయం, మర్కజ్ తైబా మురిడ్కే లష్కరే తాయిబాకు స్థావరం కాగా సర్జాల్, తెహ్రా కలాన్ జైషేముహ్మద్కు కేంద్రంగా ఉంది. హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ మెహమూనా జోయా సియాల్కోట్ కేంద్రంగా పనిచేస్తోంది. అలాగే లష్కరేకకు మస్జీద్ ఆహ హదిత్ బామాలా, కోట్లిలోని మస్జిద్ అబ్బాస్ జైషే ముహమ్మద్, అక్కడే ఉన్న మస్కర్ రహీల్ షహీద్ హిజ్బుల్ ముజాహిదీన్లు పనిచేస్తున్నాయి. ఇక ఈ నివేదికలు పీవోకేలోని ముజఫరాబాద్లో లష్కరేకు భారీ ఉగ్రశిక్షణా కేంద్రం ఉంది. షావైయి నల్లా శిబిరంగా పేరుపొందింది. అక్కడే జైషే సంస్థకు కూడా సైద్నా బిలాల్ శిబిరం కూడా నడుస్తోందని భారత్ నిర్దిష్టమైన అధ్యయనంచేసిన తర్వాతనే దాడులుచేసి సమూలంగా ప్రధాని మోదీ మట్టుబెట్టింది.
ప్రధాని మోదీ నేతృత్వంలో భారత సైనిక సామర్థ్యం
ఆపరేషన్ పూర్తయ్యేంతవరకూ నిరంతరం పర్యవేక్షణచేసారు. మరోపక్క రక్షణ మంత్రి రాజ్నాథ్, హోంమంత్రి అమితా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ బాల్లు సైతం దాడుల అనంతర పరిణామాలను నిత్యం పర్యవేక్షిస్తూ రాష్ట్రాలను అప్రమత్తంచేసారు. ఓపక్క నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ తెల్లవారితే యుద్ధ సమయాల్లో తీసుకోవాల్సిన మాల్స్ ను దేశంలోని 244 జిల్లాల్లో నిర్వహించే క్రమంలో ఈ దాడులు జరిగాయి. గడచిన పదిరోజులుగా భయపడుతూనే ఉన్న పాకిస్థాన్కు అంతుచిక్కని విధంగా దాడులు నిర్వహించి భారత్ తన సింధూర శక్తిని నిరూపించింది. దాడుల వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీతోపాటు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషిలు సమగ్రంగా వివరించారు. దాడుల వివరాలను కూడా విడియోలు, చిత్రాలతో సరిహద్దుకు ఎంతెంత దూరంలో ఉన్నాయో కూడా సోదాహరణంగా వివరించారు.
Read More : Miss World 2025 : మిస్ వరల్డ్ పోటీలకు ముస్తాబైన గచ్చిబౌలి