ఆపరేషన్ సిందూర్లో లంకా దహనం చేసిన హనుమంతుడే తమకు స్ఫూర్తిగా ఉన్నాడని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత సాయుధ దళాలను ఆయన ప్రశంసించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, ఆపరేషన్ సిందూర్లో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత సైన్యం దేశాన్ని గర్వపడేలా చేశారని తెలిపారు. భారత సాయుధ దళాలు తమ ధైర్యం, కచ్చితత్వంతో లక్ష్యాలను సమయపూర్వకంగా ధ్వంసం చేశాయని పేర్కొన్నారు.అంతేకాదు, భారత సైన్యం మానవత్వంతో వ్యవహరించి, పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకున్నదన్నారు. దేశం తరఫున సైనికులను అభినందించిన ఆయన, ప్రధాని మోదీకి మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. హనుమంతుడు అశోకవనానికి వెళ్ళేటప్పుడు అనుసరించిన విధానాన్ని ఈ దాడిలో తాము పాటించామని వివరించారు. అమాయక ప్రజలను కాదు, దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని రాజ్నాథ్ పేర్కొన్నారు. భారత్ మీద దాడి జరిగితే స్పందించే హక్కు భారత్‌కు ఉందని, ఈసారి కూడా తగిన ప్రతిస్పందన ఇచ్చినట్టు తెలిపారు.

Rakshana Mantri Rajnath : ఆపరేషన్ సిందూర్‌కు హనుమంతుడే స్ఫూర్తి
సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. భారతదేశం అనేక దేశాల సంస్కృతులతో స్నేహభావాన్ని కలిగి ఉందని, భారత సంస్కృతి కూడా ప్రపంచంలోని అనేక దేశాల్లో విస్తరించిందని పేర్కొన్నారు. అరబ్బులు, యూరోపియన్ దేశాల ప్రజలు భారతదేశంలో వివిధ మార్గాల్లోకి ప్రవేశించారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రిగారు మరోసారి స్పష్టం చేశారు.
Read More : Donald Trump : భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ స్పందన