జమ్మికుంట/హుజురాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2024 జనవరి నుండి ఆపరేషన్ కగార్ పేరిట నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో దండకార్యాలను జల్లెడ పడుతుండడంతో 23 మాసాలుగా ఇప్పటికే వందలాది మంది నక్సల్స్ మృతి చెందగా సుమారు 300 మంది ఛత్తీస్ గఢ్, మహరాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల ముందు లొంగిపోయిన విధితమే. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం ఛత్తీస్ గఢ్ సుకుమా జిల్లా పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు జెజ్జి, చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధీలోని తుమల్పాడ్ అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వుడ్ భద్రతా బలగాలకు నక్సలైట్లకు జరిగిన (Operation Kagar) ఎదురుకాల్పుల్లో ఇద్దరు దళ కమాండర్స్తో పాటు ముగ్గురు మరణించినట్లు సుకుమా జిల్లా పోలీస్ సూపరిండెంట్ కిరణ్ ఛవాన్ ఆదివారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. మృతి చెందిన వారీలో మద్వీదేవా అలియాస్ జెనివి లిథియా కమాండర్తో పాటు మరో మావోయిస్టు మహిళా కోంఠ ఏరియా కమిటి దళ కమాండర్ పోడియం గంగి ఇద్దరి దళ కమాండర్ లు మృతి చెందగా మరో మహిళ నక్సలైట్ కిస్తారామ్ ఏరియా కమిటి దళ సభ్యురాలు సోడి గంగి మృతి చెందినట్లు ఎస్పి కిరణ్ ఛవాన్ వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టు ఒక్కొక్కరిపై 5 లక్షల రూపాయల చొప్పున రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో మృతి చెందిన మావోయిస్టుల నుండి కిట్ బ్యాగ్లు, 303 రైఫిల్స్, బిజిఎల్ లాంఛర్లు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.
Read also: ఎఫ్ఆర్ఎస్ ప్రభావం ప్రభుత్వ బడుల్లో పెరిగిన హాజరు

ఇప్పటికైనా లొంగిపోండి : బస్తర్ రేంజ్ ఐజి సుందర్రాజన్
ఛత్తీసఘడ్(Chhattisgarh) రాష్ట్రంలో (Operation Kagar) దండకారణ్యంలో మిగిలిపోయిన మావోయిస్టులు ఇప్పటికైనా ఆయుధాలతో వచ్చి ప్రభుత్వానికి లొంగిపోతే ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుందని, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని, ఆయుధాలు దించి లొంగిపోవాలని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజన్ మావోయిస్టులకు విజప్తి చేశారు. ఛత్తీస్ ఘడ్లోని బస్తర్ దండకారణ్యంలో మావోయిస్తుల ఏరివేత కార్యక్రమం చివరి దశలో ఉందని, ఆ ఉన్న కొద్దిమంది అయిన ప్రభుత్వానికి లొంగిపోతే ప్రాణాలు దక్కుతాయని, హింసను విడిచిపెడితే పునరావాసం కల్పిస్తామని సుందర్రాజన్ విజప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: