ముంబైలో (Mumbai) భారీ స్థాయి ఆన్‌లైన్(Online scam) పెట్టుబడి మోసం వెలుగులోకి వచ్చింది. లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) సంస్థలో మాజీ అధికారి, రిటైర్డ్ న్యాయవాది అయిన 65 ఏళ్ల ఘనశ్యామ్ మచ్చింద్ర మాత్రే దాదాపు రూ. 9.94 కోట్లు సైబర్ మోసగాళ్ల (Cheaters) బారినపడి కోల్పోయారు. ప్రముఖ ఆర్థిక సంస్థ ఆనంద్ రతి షేర్స్ & స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్ పేరును దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు నిర్వహించిన నకిలీ ట్రేడింగ్ రాకెట్‌లో ఆయన చిక్కుకున్నారు.
Read Also: Sri Lanka: శ్రీలంక జట్టుకు పాక్‌లో భారీ భద్రత

మోసం తీరు, నకిలీ లాభాలు
ఈ మోసం జూన్‌లో ప్రారంభమైంది. మాత్రేకు సుమన్ గుప్తా అనే మహిళ వాట్సాప్‌లో పరిచయమై, తనను ఆనంద్ రతి సంస్థలో అడ్మిన్ అని పరిచయం చేసుకుంది. కంపెనీ పెట్టుబడుల కోసం AR Trade Mobi అనే నకిలీ యాప్ లింక్‌ను పంపింది. యాప్‌ను నమ్మించడానికి, ఆమె కేవైసీ కోసం వ్యక్తిగత వివరాలను కోరింది. వివరాలు ఇచ్చిన తర్వాత, మాత్రేను ‘Anand Rathi VIP 12’ అనే వాట్సాప్ గ్రూప్‌లో (WhatsApp group) చేర్చారు. ఈ గ్రూప్‌లోని వ్యక్తులు తమను తాము మార్కెట్ నిపుణులు, స్టాక్ విశ్లేషకులుగా పరిచయం చేసుకుని పెట్టుబడి సలహాలు ఇచ్చారు.
యాప్‌లో నకిలీ లాభాలు చూపించడం ప్రారంభమైంది. దీనిని నిజమైన పెట్టుబడి వేదికగా నమ్మిన మాత్రే, జూన్ నుండి నవంబర్ 2025 వరకు రూ.9.94 కోట్లకు పైగా అనేక బ్యాంకు ఖాతాలకు పంపించారు. ఈ చెల్లింపులను ఐపీవోలు, మ్యూచువల్ ఫండ్లు, ప్రత్యేక పెట్టుబడి స్కీములుగా మోసగాళ్లు చూపించారు.
మోసం వెలుగులోకి, పోలీసు కేసు
తర్వాత, మాత్రే డబ్బును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా లావాదేవీ విఫలమైంది. సాంకేతిక లోపాలు ఉన్నాయని, ఉపసంహరణ కోసం అదనంగా పన్నులు, చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని మోసగాళ్లు చెప్పడం ప్రారంభించారు. దీంతో అనుమానం వచ్చిన ఆయన, మలద్‌లోని ఆనంద్ రతి కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా, సుమన్ గుప్తా తమ సంస్థలో పనిచేయడం లేదని, AR Trade Mobi యాప్‌కు తమ కంపెనీతో సంబంధం లేదని తేలింది.
తాను మోసపోయానని గ్రహించిన మాత్రే తూర్పు ప్రాంత సైబర్ క్రైమ్(Cybercrime) పోలీసులను సంప్రదించారు. పోలీసులు పది మంది గుర్తు తెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత (BNS), సమాచార సాంకేతిక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం దేశవ్యాప్తంగా పనిచేసే ఒక పెద్ద నెట్‌వర్క్‌దని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: