2025 ఆన్లైన్ గేమింగ్ బిల్లు (Online Gaming Bill 2025) ఇవాళ రాజ్యసభలో స్వీకరించబడింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో పాస్ అయిన సంగతి తెలిసిందే. విపక్షాల నిరసనలు, అభ్యంతరాల మధ్య లోపల చర్చ లేకుండానే బిల్లును ఆమోదించారు. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు(Online Gaming Bill 2025)
పార్లమెంట్‌లో పాసైంది. ఇవాళ రాజ్యసభలో ఆ బిల్లుకు ఆమోదం (approval) దక్కింది. విపక్షాలు తీవ్ర ఆందోళన చేపడుతున్న నేపథ్యంలోనే బిల్లును పాస్ చేశారు. ఎటువంటి చర్చ లేకుండానే బిల్లుకు పచ్చజెండా ఊపారు. కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్‌లో జరిగే అన్ని రకాల మనీ గేమ్స్‌ను నిషేధిస్తూ ఈ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లు ద్వారా ఈస్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమింగ్‌ను మాత్రం ప్రమోట్ చేస్తున్నారు.

విపక్ష సభ్యులు ఇచ్చిన సవరణలను తోసిపుచ్చుతూ.. ఇవాళ రాజ్యసభలో ఆ బిల్లుకు ఆమోదం దక్కింది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు (Online Gaming Bill 2025)బుధవారం లోక్‌సభలో క్లియరెన్స్ దక్కిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ మనీ గేమ్స్, బ్యార్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన వాణిజ్య ప్రకటనపై కూడా నిషేధం విధించారు. డబ్బులు డిపాజిట్ చేసి ఆన్‌లైన్ మనీ గేమ్స్ ఆడే విషయం తెలిసిందే. గెలిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో ఈ క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతోంది.
ఆన్లైన్ జూదం గురించి చట్టాలు ఏమిటి?
యునైటెడ్ స్టేట్స్ సమాఖ్య చట్టం ప్రకారం అంతర్రాష్ట్ర ఆన్‌లైన్ జూదం చట్టవిరుద్ధం , దాని మార్కెటింగ్, ప్రమోషన్ లేదా ప్రకటనలు కూడా చట్టవిరుద్ధం. రాష్ట్రాలు అంతర్రాష్ట్ర జూదాన్ని చట్టబద్ధం చేయడం ప్రారంభించాయి, అయితే రాష్ట్రంలో భౌతికంగా ఉన్న వ్యక్తులు లైసెన్స్ పొందిన ఆపరేటర్లతో మాత్రమే పందెం వేయగలరు.
ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 ఏమిటి?
పార్లమెంటు ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు, 2025ను ఆమోదించింది, రాజ్యసభ ఈరోజు దీనికి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఇ-స్పోర్ట్స్ మరియు ఆన్‌లైన్ సోషల్ గేమ్‌లను ప్రోత్సహిస్తూనే హానికరమైన ఆన్‌లైన్ మనీ గేమింగ్ సేవలు, ప్రకటనలు మరియు వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిషేధిస్తుంది .
ఆన్లైన్ గేమ్స్ నియమాలు?
భారతదేశంలోని అన్ని సైబర్ కార్యకలాపాలు లేదా ఆన్‌లైన్ జూదం 2000 ఐటీ చట్టం కింద నియంత్రించబడతాయి . ఈ చట్టం ఆన్‌లైన్ జూదం కార్యకలాపాలను నిషేధిస్తుంది మరియు INR 100,000 జరిమానా లేదా 5 సంవత్సరాల వరకు జైలు శిక్షను విధిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: