దేశంలో ప్రతీ సంవత్సరం ఉల్లి, టమాట ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తుంటాయి. కొన్నిసార్లు ఉల్లి కిలో రూ.200 దాటుతుంటే, మరికొన్నిసార్లు కిలోకు రూ.1కే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ రెండు పంటలు రైతులకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేవి గానీ, అదే సమయంలో దురదృష్టానికి కారణమవుతుంటాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా అలాంటిదే.
Read Also: Netanyahu: మా సపోర్ట్ భారత్‌కు ఎప్పుడూ ఉంటుంది: నెతన్యాహు
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో ఉల్లి ధరలు అనూహ్యంగా పడిపోయాయి. దీంతో పంట సాగు, కోత, రవాణా ఖర్చులను కూడా రైతులు సంపాదించలేక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఉల్లిధర బాగా పడిపోతుండగా.. తాజాగా మాండ్‌సౌర్‌లో కిలో ఉల్లి కేవలం ఒకే ఒక్క రూపాయి పలకడం గమనార్హం. పంత్ పిప్లోడాకు చెందిన బాబు మాల్వీ అనే ఉల్లి రైతు.. మీడియాతో మాట్లాడుతూ..

తన భూమిలో పండిన 6-7 క్వింటాళ్ల ఉల్లిని కిలో రూ.1.99 చొప్పున అమ్ముకోవాల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పంట అంత అమ్మినా వచ్చిన ధర.. దాన్ని మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు అయిన రవాణా ఖర్చులకు కూడా సరిపోవడం లేదని వాపోయారు.
రూ.35 వేల వరకు రైతులు పెట్టుబడి
రత్లాం వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలో కనీస ధర క్వింటాల్‌కు రూ.200 వద్ద రికార్డయింది. అంటే కిలో రూ.2 మాత్రమే పలికింది. ఇక సగటు ధర క్వింటాల్‌కు రూ.600గా పలుకుతోంది. ఇక ఉల్లి పంటను పండించేందుకు..
ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు రైతులు పెట్టుబడి పెడుతున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలకు తాము పెట్టిన కనీస ఖర్చులను కూడా రాబట్టలేకపోతున్నామని కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: