గిరిజనులకు (Tribals ) భారీ గృహ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను ప్రారంభించింది. ‘దర్తీ అబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్’ (DAJGUI) పథకం ద్వారా కేంద్రం లక్ష ఇళ్లను మంజూరు చేయనుంది. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాల్లో గృహ నిర్మాణం ప్రోత్సాహం పొందనుంది. పేద గిరిజన కుటుంబాలకు స్థిర నివాస వసతి కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
ఇంటికి రూ.72 వేల కేంద్ర సాయం
ఇలా మంజూరయ్యే ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.72,000 రూపాయల సాయం అందించనుంది. మిగిలిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం తరహాలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో ఒక్కో ఇంటికి మొత్తం రూ.5 లక్షల వ్యయం ఖర్చవుతుంది. ఇది కేంద్ర, రాష్ట్ర సహకారంతో జరుగుతోంది.
ఇళ్ల కలను నెరవేర్చే ప్రయత్నం
ఇప్పటి వరకు నివాసం లేక కొట్టుమిట్టాడుతున్న గిరిజన కుటుంబాలకు ఈ పథకం ఓ గొప్ప ఆశగా నిలవనుంది. గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనులకు గృహ భద్రతతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా ఈ పథకం ద్వారా అందనుంది. ప్రభుత్వాలు మౌలిక వసతులు కల్పించడంలో ముందడుగు వేస్తుండగా, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Kamal Haasan : కత్తి పట్టుకోమన్న కార్యకర్తపై కమల్ హాసన్ ఫైర్…