हिन्दी | Epaper

Pet dog : పెంపుడు కుక్కల పెంపకంపై సూరత్‌లో కఠిన ఆంక్షలు

Divya Vani M
Pet dog : పెంపుడు కుక్కల పెంపకంపై సూరత్‌లో కఠిన ఆంక్షలు

పెంపుడు జంతువులను (Pet dog) ప్రేమించే వారికి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (Surat Municipal Corporation) షాక్ ఇచ్చింది. ఇకపై ఇంట్లో కుక్కను పెంచుకోవాలంటే పొరుగు వారి అనుమతి తప్పనిసరి. అందుకోసం ఏకంగా పది ఇరుగుపొరుగు వారు NOC ఇవ్వాల్సిందే.ఇది కేవలం ఇండిపెండెంట్ ఇళ్లకే పరిమితం కాదు. అపార్ట్‌మెంట్లలో నివసించేవారు అయితే సంక్షేమ సంఘం ఛైర్‌పర్సన్, కార్యదర్శుల అనుమతి కూడా తప్పనిసరి. ఈ ఇద్దరి నుంచి ఎన్‌ఓసీలు తీసుకురాకపోతే పెంపుడు కుక్కను ఉంచడం కుదరదు.ఈ కఠిన నిర్ణయానికి కారణం ఒక విషాద ఘటన. మే నెలలో నగరంలో ఓ చిన్నారి కుక్క దాడిలో మృతి చెందాడు. ఆ ఘటన అందరిని కలచివేసింది. అటువంటి విషాదాలు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

Pet dog : పెంపుడు కుక్కల పెంపకంపై సూరత్‌లో కఠిన ఆంక్షలు
Pet dog : పెంపుడు కుక్కల పెంపకంపై సూరత్‌లో కఠిన ఆంక్షలు

పెంపుడు జంతు యజమానుల్లో అసంతృప్తి

ఈ నిర్ణయం స్థానికంగా పెద్ద చర్చగా మారింది. పెంపుడు జంతు యజమానులు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. “ఇల్లు నాదే, కానీ జంతువును ఉంచుకోవాలంటే పొరుగు వారి అనుమతి ఎందుకు?” అంటూ ప్రశ్నిస్తున్నారు.

Pet dog : పెంపుడు కుక్కల పెంపకంపై సూరత్‌లో కఠిన ఆంక్షలు
Pet dog : పెంపుడు కుక్కల పెంపకంపై సూరత్‌లో కఠిన ఆంక్షలు

పెంపుడు కుక్కలకు పాస్ కావాలా? – నెటిజన్ కామెంట్స్

ఈ నిబంధనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ప్రజల భద్రత కోసం ఇది సరైన అడుగు అంటుంటే, మరికొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛపై హక్కుల ఉల్లంఘనగా అభిప్రాయపడుతున్నారు. “ఇకపై కుక్కలకు పాస్‌పోర్ట్ కూడా కావాలా?” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.సూరత్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఇతర నగరాలు కూడా ఇదే బాటలో నడుస్తాయా? అనే ప్రశ్న ముందుకొస్తోంది.

Read Also : Pakistan : పాకిస్థాన్‌లో జనంపైకి దూకిన పెంపుడు సింహం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

📢 For Advertisement Booking: 98481 12870