కేంద్రంలోని అధికార బీజేపీ పై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్రహోదా (Statehood) ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. జమ్ముకశ్మీర్‌లో బీజేపీ అధికారం కోల్పోయిందని, అందుకే రాష్ట్రహోదా ఇవ్వలేదని ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా కల్పించడంలో జాప్యం చేయడమంటే అది అక్కడి ప్రజలకు అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు. బుధవారం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మీడియాతో మాట్లాడుతూ.. ‘జమ్ముకశ్మీర్ ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ఎన్నికల్లో బీజేపీ గెలువకపోవడం వాళ్ల దురదృష్టం. ఏదేమైనా అందుకోసం ఇక్కడి ప్రజలు శిక్ష అనుభవించొద్దు. చూడబోతే ఎన్నికల్లో బీజేపీ గెలువలేకపోయినందుకే జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా ఇవ్వడం లేదేమో అనిపిస్తున్నది. ఇది ప్రజలపాలిట అన్యాయం. ఫలితాలు బీజేపీ అనుకూలంగా ఉంటేనే రాష్ట్రహోదా ఇస్తామనుకోవడం కరెక్ట్ కాదు.

జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదాపై వ్యతిరేకత బీజేపీ నుంచే వస్తోంది’ అన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా కల్పించే విషయంలో తాము డీలిమిటేషన్, ఎలక్షన్స్, స్టేట్‌హుడ్ అనే ‘త్రీ స్టెప్ ఫార్ములా’ను అమలుచేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పిందని, ఇప్పుడు త్రీ స్టెప్స్ పూర్తయినా రాష్ట్రహోదాను మాత్రం కల్పించలేదని ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ అనేది అతిపెద్ద సవాల్ అని వ్యాఖ్యానించారు.
ఒమర్ అబ్దుల్లా రాజకీయ జీవితం?
ఒమర్ అబ్దుల్లా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, 2009 జనవరి 5 నుండి 2015 జనవరి 8 వరకు జమ్మూ కాశ్మీరు 8వ ముఖ్యమంత్రిగా పని చేశాడు.
ఒమర్ అబ్దుల్లా వ్యక్తిగత జీవితం?
ఒమర్ అబ్దుల్లా 1970 మార్చి 10న యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఎసెక్స్‌లోని రోచ్‌ఫోర్డ్‌లో జన్మించారు . ఆయన షేక్ అబ్దుల్లా మనవడు మరియు జమ్మూ & కాశ్మీర్ వైద్యుడు మరియు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఏకైక కుమారుడు. ఈ ముగ్గురు పురుషులు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు. ఆయన తల్లి, ఆంగ్ల మహిళ మరియు వృత్తిరీత్యా నర్సు అయిన మోలీ , ఆయన రాజకీయాల్లోకి రావడానికి తాను ఇష్టపడనని చెప్పారు. ఆయన శ్రీనగర్‌లోని సోన్వర్ బాగ్‌లోని బర్న్ హాల్ స్కూల్‌లో మరియు తరువాత సనవర్‌లోని లారెన్స్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆయన సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి బి.కామ్. గ్రాడ్యుయేట్. రాజకీయాల్లోకి రాకముందు 29 సంవత్సరాల వయస్సు వరకు ఆయన ఐటిసి లిమిటెడ్ మరియు ది ఒబెరాయ్ గ్రూప్‌లో ఉద్యోగం చేశారు. ఆయన స్ట్రాత్‌క్లైడ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ప్రారంభించారు , అయితే లోక్‌సభకు ఎన్నికైనందున, ఆయన ఆ కోర్సు నుండి తప్పుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: