దేవుడిపై విశ్వాసంతో(confidence) ఎన్నో మొక్కుబడులు చేస్తుంటాం. ఆరోగ్యం బాగైతే, ఆర్థికంగా కలిసివస్తే, ఉద్యోగం వస్తే..ఇల్లుకడితే ఇలా మన కోరికలు, సమస్యల పరిష్కారం క ఓసం దేవతలకు మొక్కుబడి చేస్తాం. అనుకున్నట్లుఆరోగ్యం కుదుటపడితే లేదా కష్టం నుంచి గట్టెక్కితే అనుకున్న మొక్కువడి చెల్లించేందుకు ఏమాత్రం వెనుకంజ వేయరు. ఇలాంటి సంఘటనే తమిళనాడులో జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రూ.10లక్షల మేకలు
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఓ లారీ డ్రైవర్ ఏకంగా 151 మేకలను బలిచ్చాడు. ఇందుకు కారణం తన మొకు తీరడమే. ధర్మపురి జిల్లా పెన్నాగరం తాలూకా ఏరియూర్ కు దగ్గరలో ఉన్న అత్తిమరత్తూర్ గ్రామానికి చెందిన తంగరాజ్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య హంసతో పాటు కుమారుడు ఉన్నాడు. అయితే తంగరాజ్ గత ఆరేళ్ల ముందు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఆయన రోగం నయం కాలేదు. ఎవరూ చికిత్స చేసినా నయం కాలేదు. కొంతమంది స్నేహితులు చెప్పిన సమాచారంతో పెన్నాగరం సమీపంలోని బి. అగ్రహారంలో ఉన్న ముత్తు మారయమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. తన ఆరోగ్యం కుదుట పడితే 151 మేకలతో మొక్కు తీర్చుకుంటానని వేడుకున్నాడు. ఆయన కోరుకున్నట్లే ఆరోగ్యం బాగవడంతో రే.10 లక్షలతో 151 మేకలు కొనుగోలు చేసి మంగళవారం ముత్తు మారియమ్మన్ ఆలయ(Muthu Mariamman Temple) ప్రాంగణంలో అమ్మవారికి బలిచ్చాడు. అనంతరం భక్తులకు మాంసాహారంతో విందు ఏర్పాటు చేయడం గమనార్హం.

ఎక్కడ 151 మేకలు బలి ఇచ్చారు?
ఒక ఆలయంలో జరిగిన విశేష మొక్కు కార్యక్రమంలో ఈ బలి జరిగింది.
ఎందుకు మేకలు బలి ఇస్తారు?
భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత మొక్కు తీర్చుకోవడానికి బలి ఇస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: