ఒడిశా (Odisha) రాష్ట్రంలోని బాలసోర్‌లో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన విద్యా వ్యవస్థపై, సమాజపు విలువలపై తీవ్ర ప్రశ్నలు కలుగజేస్తోంది. ఫకీర్ మోహన్ కాలేజీ (Fakir Mohan College) లో చదువుతున్న ఓ యువతిపై ఆ కళాశాలలో పని చేస్తున్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (HOD) సమీర్ కుమార్ సాహు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
వేధింపులు.. హెచ్చరికలు.. విఫలమైన ఫిర్యాదులు:
బాధితురాలు ఫకీర్ మోహన్ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సు చదువుతున్నది. హెచ్‌వోడి సమీర్ కుమార్ సాహు (HOD Sameer Kumar Sahu) యువతిని లైంగికంగా వేధించాడు. కోరిక తీర్చకుంటే భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరించాడు. టీచర్ వేధింపులను ఆ విద్యార్థిని భరించలేకపోయింది. జూలై 1న కంప్లైంట్ సెల్‌కు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి ఏడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ, ఎలాంటి చర్యలు లేకపోవడంతో కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. మిగతా స్టూడెంట్స్‌తో కలిసి ప్రిన్సిపాల్ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది.
నిప్పంటించుకున్న విద్యార్థిని:
ప్రిన్సిపాల్ నుండి కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని జూలై 13న ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుటే తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. హఠాత్పరిణామానికి తోటి విద్యార్థులు షాక్ అయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఒక స్టూడెంట్‌కు కూడా మంటలంటుకున్నాయి. ఇద్దరిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు వారిని తరలించారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు:
ఈ సంఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కీచక టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడిని అరెస్టు చేయడమే కాక, కాలేజీ పాలక వర్గంపై కూడా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు గట్టిగా కోరుతున్నారు.
మంత్రుల స్పందన:
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రి సూర్యబన్షి సూరజ్ ప్రకటించారు. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు సమీర్ కుమార్ సాహును అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Assam: భార్యతో విడాకులు తర్వాత పాలతో స్నానం చేసిన భర్త..