పేదరికం ఒకవైపు, తోడుగా నిలిచే వారు లేని పరిస్థితి మరోవైపు. అనారోగ్యంతో ఉన్న భార్యకు ఏం అవుతుందో అన్న భయం ఒకవైపు, ఆమెను కాపాడుకోవాలన్న తపన మరోవైపు. అంబులెన్స్‌కు డబ్బులు లేని దుర్భర పరిస్థితి ఇంకొవైపు. ఓ 70 ఏళ్ల వృద్ధుడు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా హృదయాలను కలచివేస్తోంది. భార్యను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు, ఏకంగా 600 కిలోమీటర్లు రిక్షా తొక్కుతూ ప్రయాణించాడు. ఈ సంఘటన ఒడిస్సా (Odisha) లో చోటుచేసుకుంది.
Read Also: NEET PG 2026: నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
నాకు జీవితంలో కేవలం రెండు ప్రేమలు మాత్రమే ఉన్నాయి
సంబల్‌పూర్‌లోని మోడిపాడ ప్రాంతానికి చెందిన బాబు లోహర్ రిక్షా తొక్కుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2025 నవంబర్‌లో అతడి భార్య జ్యోతి పెరాలటిక్ స్ట్రోక్ (మెదడుకు రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడి.. మెదడు కణాలు చనిపోవడానికి దారితీసే పరిస్థితి) వచ్చింది. దీంతో స్థానిక వైద్యులు.. కటక్‌లో ఉన్న ఎస్‌సీబీ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సిఫార్సు చేశారు. అయితే అంబులెన్స్‌లో లేదా ఇతర వాహనంలో తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బాబు లోహర్ వద్ద డబ్బులు లేవు.

దీంతో తన రిక్షాలోనే భార్యను ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించుకున్నాడు.బాబు లోహర్ రిక్షాపై కొన్ని పాత మెత్తలు వేసి.. తన భార్యను వాటిపై కూర్చోబెట్టాడు. అనతంరం దేవుడి నామాన్ని జపిస్తూ రిక్షా తొక్కినట్లు తెలిపాడు. “నాకు జీవితంలో కేవలం రెండు ప్రేమలు మాత్రమే ఉన్నాయి. ఒకటి నేను ఇంటికి తిరిగి తీసుకెళ్తున్న నా భార్య. మరొకటి నా రిక్షా. ఈ రెండింటిలో ఏది లేకున్నా నేను ఉండలేను” అని చెప్పాడు బాబు లోహర్.
ఈ క్రమంలో సహాయం చేస్తామన్న పోలీసుల విజ్ఞప్తిని కూడా సున్నితంగా తిరస్కరించాడు బాబు లోబర్. తాము వాహనం ఏర్పాటు చేస్తామని చెప్పినా.. అతను నిరాకరించాడని టంగి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ బికాష్ సేథీ తెలిపారు. తాము బలవంతం చేస్తే.. సంబల్‌పూర్‌కు వెళ్లే దారిలో ఆహారం తినడానికి కొన్ని డబ్బులు తీసుకున్నాడని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: