బిహార్ లో, జేడీయూ అధినేత నితీష్ కుమార్ (Nitish Kumar) మళ్లీ బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోని గాంధీ మైదానం ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా, జెపి నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా తదితరులు హాజరయ్యారు.
Read Also: Anil Ambani: అనిల్ అంబానీకి మరో భారీ దెబ్బ రూ.1,400 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు
పదోసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం
భారీ భద్రత, వేలాది మంది ప్రజల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగింది.నితీష్ కుమార్ (Nitish Kumar) సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఇది పదోసారి కావడం విశేషం. ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఓ రికార్డు అని చెప్పాలి. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా 26 మంది ప్రమాణం చేశారు. బీజేపీ (14), జేడీయూ (8), ఎల్జేపీ (రామ్‌విలాస్) (2), హిందుస్థానీ అవామీ మోర్చా (1), రాష్ట్రీయ లోక్ మోర్చా (1) సభ్యులతో మంత్రి వర్గం ఏర్పాటు చేయనున్నారు నితీష్.
మరో 10 మంది మంత్రులను కేబినెట్ లోకి తీసుకోనున్నారు.ఇక తన తండ్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై నితీష్ కుమార్ (Nitish Kumar) కుమారుడు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ..”నా తండ్రి 10వ సారి ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆయనకు నా శుభాకాంక్షలు.. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: