हिन्दी | Epaper

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు

Sharanya
Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) నివాసానికి బాంబు పెట్టినట్టు ఆదివారం వచ్చిన ఓ బెదిరింపు కాల్ (Threatening call), మహారాష్ట్ర నాగ్‌పూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతను కలిగించింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, మంత్రిగారి ఇంట్లో బాంబు పెట్టినట్టు చెప్పడంతో, పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అలెర్ట్ అయింది.

అప్రమత్తమైన పోలీసులు – బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

గడ్కరీ నివాసానికి వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు చేరుకుని ఇంటి పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఇంటి లోపల, బయటి ప్రాంగణంలో అత్యంత జాగ్రత్తగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి మూలను జల్లెడ పట్టినా ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో ఇది నకిలీ బెదిరింపు కాల్ అని పోలీసులు ధృవీకరించారు.

నిందితుడి పట్టివేత – మద్యం దుకాణంలో పని చేస్తున్న వ్యక్తి కాల్ వెనుక

ఈ కాల్‌ను పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. కొద్ది సమయంలోనే నాగ్‌పూర్ క్రైమ్ బ్రాంచ్ బృందం, నిందితుడి ఆచూకీ గుర్తించింది. నిందితుడిని ఉమేష్ విష్ణు (accused is Umesh Vishnu) రౌత్గా గుర్తించారు. అతను తులసి బాగ్ రోడ్డులోని ఒక మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఉమేష్ ఎందుకు గడ్కరీ (Nitin Gadkari) ఇంటికి ఇలా బెదిరింపు కాల్ చేశాడన్న అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ktr-brs-team-delhi-election-commission-meeting/telangana/525277/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

No image

దేశంలో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందని – రాహుల్ గాంధీ హెచ్చరించారు.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

📢 For Advertisement Booking: 98481 12870