పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. లోక్‌సభలో ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పలు బిల్లులను ప్రవేశపెట్టారు. 2025 సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. 1944 నాటి సెంట్రల్ ఎక్సైజ్ బిల్లును సవరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. హెల్త్ సెక్యూర్టీ, నేషనల్ సెక్యూర్టీ సెస్ బిల్లును కూడా మంత్రి ప్రవేశపెట్టారు. జాతీయ భద్రత, ప్రజా ఆరోగ్యం కోసం నిధులను పెంచాలని కోరుతూ బిల్లును రూపొందించారు. మణిపూర్‌కు చెందిన జీఎస్టీ సవరణ బిల్లును కూడా మంత్రి నిర్మల(Nirmala Sitharaman) సభలో ప్రవేశపెట్టారు.
Read Also : http://Sanchar Saathi App: కొత్త స్మార్ట్‌ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!

మరో వైపు సిర్‌పై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ జరుగుతున్న సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను నిలిపివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణ కోసం కొన్ని రాష్ట్రాల్లో సిర్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
నిర్మలా సీతారామన్ అర్హతలు?
1984లో, ఆమె న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చేరారు, అక్కడ ఆమె ఆర్థిక శాస్త్రంలో ఆర్ట్స్ మరియు తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని సంపాదించారు. సీతారామన్ తన పిహెచ్‌డి ప్రారంభించారు.
నిర్మలా సీతారామన్ మంత్రి ఎవరు?
నిర్మలా సీతారామన్ ఒక భారతీయ ఆర్థికవేత్త, రాజకీయ నాయకురాలు మరియు భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, 2019 నుండి భారత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: