హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రయాణం ఇకపై మరింత సులభతరం కానుంది. (NH-44 Road) ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా, ప్రయాణాన్ని మరింత సురక్షితం, వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల NH-44 రహదారిని ఆరు వరుసల ‘యాక్సెస్ కంట్రోల్’ ఎక్స్‌ప్రెస్‌వేగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport and Highways) పచ్చజెండా ఊపింది. ఈ మార్పుతో ప్రయాణికులు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం కలుగుతుంది.
Read Also: Nalgonda murder: అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

హైదరాబాద్–బెంగళూరు ప్రయాణం ఇక 5 గంటలే
ఈ రెండు నగరాల మధ్య పూర్తిగా కొత్త ‘గ్రీన్‌ఫీల్డ్’ హైవేను నిర్మించాలని అధికారులు భావించారు. ఇందుకోసం మూడు రకాల అలైన్‌మెంట్లతో క్షేత్రస్థాయి అధ్యయనం కూడా నిర్వహించారు. అయితే.. కొత్తగా భూసేకరణ చేయడం, (NH-44 Road) పాత హైవేకు సమాంతరంగా నిర్మించడం వల్ల ఖర్చు, పొడవు పెరుగుతుందని అంచనా వేశారు.
NH-44 పొడవు 576 కి.మీ.గా ఉండటంతో, కొత్త గ్రీన్‌ఫీల్డ్ మార్గం కూడా దాదాపు అంతే దూరం వస్తోంది. దీంతో ఆర్థికంగా, సాంకేతికంగా ప్రస్తుత రహదారినే ఆరు వరుసలకు విస్తరించి, ‘యాక్సెస్ కంట్రోల్’ విధానంలోకి మార్చడమే ఉత్తమమని నిపుణులు తేల్చారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఐదు నెలల్లోగా సిద్ధం చేయాలని కాంట్రాక్టింగ్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోవడానికి సగటున 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. యాక్సెస్ కంట్రోల్ విధానం అమల్లోకి వస్తే.. ఈ సమయం కేవలం 5 గంటలకు తగ్గుతుందని అంచనా. దీనివల్ల హైవేపై వెళ్లే వాహనాలకు మధ్యలో ఎటువంటి అవాంతరాలు ఉండవు. ప్రధాన రహదారిపై ప్రమాదాల ముప్పు గణనీయంగా తగ్గుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: