భారత్-పాకిస్థాన్ల మధ్య ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) యుద్ధంతో రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఉగ్రకదలికలపై దృష్టిని సారించింది. ప్రధాన నగరాలపై ఫోకస్ పెట్టింది. దీంతో పలు పాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఉగ్రవాదులతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిజమాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉగ్రలింకులు కలకలం రేపాయి. బోధన్ (Bodhan) పట్టణంలోని అనుమానిత ప్రాంతాల్లో బుధవారం ఢిల్లీ స్పెషల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

డానిష్ ఇచ్చిన సమాచారంతోనే
బోధన్కు చెందిన యామన్ బీ-ఫార్మసీ చదువుతున్నట్లు తెలుస్తోంది. యామన్ ఇటీవల ఝార్ఖండ్ లో అరెస్టు చేసిన ఐఎస్ఐఎస్ (ISIS) ఉగ్రవాది డానిష్ తో యామన్ చాటింగ్, వీడియో కాల్ మాట్లాడినట్లు నిర్ధారించారు. ఇతర దేశస్తులతోనూ యామన్ మాట్లాడినట్లు గుర్తించారు. కృష్ణజింక ను చంపిన కేసులో యామన్ తండ్రి నిందితుడిగా ఉన్నాడు. డానిష్ ఇచ్చిన సమాచారంతోనే యామన్ అరెస్టు డానిష్ను విచారిస్తున్న సమయంలో బోధన యువకుడి పేరు బహిర్గతమైనట్లు పేర్కొంటున్నారు. డానిష్ ఇచ్చిన సమాచారంతోనే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేసి, విచారిస్తున్నారు.
Q1: భారత్-పాకిస్థాన్ మధ్య ఏం జరుగుతోంది?
A1: ఆపరేషన్ సిందూర్ యుద్ధం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు కట్టుదిట్టం అయ్యాయి.
Q2: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఏమి జరిగింది?
A2: బోధన్ పట్టణంలో ఢిల్లీ స్పెషల్ పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఉగ్రవాదులతో సంబంధం ఉన్న అనుమానిత యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: