News Telugu: ఝార్ఖండ్ రాష్ట్రంలో ఒక వ్యక్తిని అతని భార్య తన ప్రియుడి సహాయంతో హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాధితుడు లుంబా ఓరాన్ అని పోలీసులు గుర్తించారు.
వివాహేతర సంబంధమే హత్యకు కారణం
రాంచీ (Ranchi) లో నివాసముండే లుంబా భార్య గీతా దేవి కొంతకాలంగా ఇర్ఫాన్ అన్సారీ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈ విషయం భర్త లుంబాకు తెలిసి, పలుమార్లు ఆమెను మందలించాడు. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవి. చివరికి భర్త అడ్డుపడుతున్నాడని భావించి గీతా దేవి తన ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది.

మద్యం, నిద్రమాత్రలతో మత్తు – కారులో దారుణం
ఈ నెల 20న ఇర్ఫాన్ అన్సారీ లుంబాకు మద్యం తాగించాడు. అదికాకుండా మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇవ్వడంతో పాటు దాదాపు 10–15 నిద్రమాత్రలు (10–15 sleeping pills) కూడా తాగించాడు. దీంతో లుంబా అపస్మార స్థితిలోకి చేరాడు. అనంతరం కారులోకి ఎక్కించుకుని అతని గొంతు కోసి చంపేశారు. తర్వాత మృతదేహాన్ని జాతీయ రహదారి పక్కన పడేసి పరారయ్యారు.
నిందితుల అరెస్టు – ఆధారాలు స్వాధీనం
పోలీసులు దర్యాప్తు జరిపి గీతా దేవి, ఇర్ఫాన్ అన్సారీని అరెస్టు చేశారు. విచారణలో నిందితురాలు తన భర్త కదలికలను గమనించేందుకు ఇంట్లోనే సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసినట్లు బయటపడింది. పోలీసులు నిందితుల నుంచి కారు, బైక్, మొబైల్ ఫోన్లు, మద్యం సీసాలు, నిద్రమాత్రల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: