భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) దేశ రక్షణలో మరో మైలురాయిని నమోదు చేసింది. ఒడిశా తీరంలో శనివారం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ విజయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ప్రకటించారు.

రక్షణ మంత్రిపరిశుభ్రాభినందనలు
ఈ ప్రయోగ విజయం సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh), డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, భారత సాయుధ దళాలు, పరిశ్రమలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. “ఐఏడీడబ్ల్యూఎస్ మన దేశానికి బహుళస్థాయి గగనతల రక్షణ సామర్థ్యాన్ని అందించింది. ఈ ప్రత్యేకమైన అభివృద్ధి శత్రువుల వైమానిక దాడుల నుండి దేశంలోని కీలక ప్రాంతాలను, ముఖ్యమైన సౌకర్యాలను కాపాడుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
బహుళస్థాయి రక్షణ వ్యవస్థ
IADWS అనేది ఒకే ఆయుధం కాదు, ఇది సమగ్ర రక్షణ కవచం. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థలో
- క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (QRSAM)
- అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS)
- లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (DEW)
మూడు ప్రధానమైన రక్షణ ఆయుధాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి గగనతలానికి ఒక అభేద్యమైన భద్రతా గోడగా నిలుస్తాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
దేశ రక్షణలో నూతన శిఖరాలు
ఈ ప్రయోగంతో భారత రక్షణ రంగం మరింత బలపడింది. దేశీయ సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ గగనతల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకెళ్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది భవిష్యత్తులో దేశ భద్రతా వ్యూహంలో ఒక కీలకమైన పాత్ర పోషించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: