కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ (toll collection system) ఏడాదిలోపు కనుమరుగవుతుందని వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం లో నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Also: Gaurav Gogoi: టోల్ గేట్లు ఉన్నప్పటికీ రోడ్ల నాణ్యత చాలా తక్కువ.. ఎంపీ గౌరవ్ గొగోయ్
4,500 హైవే ప్రాజెక్టులు

ఈ వ్యవస్థను ఇప్పటికే 10 ప్రాంతాల్లో అమలు చేస్తున్నామని, ఒక సంవత్సరం లోపు దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఆయన అన్నారు. ‘ప్రస్తుత టోల్ వసూళ్ల వ్యవస్థ ఏడాదిలోపు ముగుస్తుంది. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ వ్యవస్థ (electronic system) అందుబాటులోకి వస్తుంది. ఇక టోల్ కోసం ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత హైవేలో ప్రయాణించేవారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
ఏడాదిలోపు దేశవ్యాప్తంగా విస్తరిస్తాం’ అని లోక్‌సభకు తెలిపారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల విలువైన 4,500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా గడ్కరీ తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: