New Delhi : దేశ రాజధాని ఢిల్లీ నగరం కల్తీ వస్తువుల తయారీకి కేరాఫ్ గా మారుతోంది. నిన్నటి వరకు కొన్ని రకాలన కిలీ వస్తువుల తయారీ వరకే పరిమితమైన ఢిల్లీ నగరం (Delhi city) నేడు ఖరీదైన విదేశీ సిగరెట్ల పేరిట నాసిరకం పొగాకుతో కల్తీ వస్తువుల తయారీతో పాటు నికోటిన్ సహా ప్రమా దకర రసాయనాలతో ఈ.. సిగరెట్ల తయారీ కూడా ఎక్కువగా జరుగుతుండడం పోలీసులకు పెద్ద సవాబ్ గా మారుతోంది. ఢిల్లీ నగరంలో తయారవుతున్న కల్తీ సరుకు హైదరాబాద్ సహా దేశంలోని అన్ని నగరాలకు సరఫరా అవుతుండగా ఆయా నగరాలలోని చోటా వ్యాపారులు, నేరగాళ్లు వీటికి ఏజెంట్లుగా వ్యవహరిస్తూ మార్కెట్లను కాసించే స్థాయికి చేరుకోవడం విశేషం. ఢిల్లీ సరుకు అంటే ఒకప్పుడు కచ్చితంగా మంచిదనే పేరుండేది.
ఆహార వస్తువులు ఇలా అనేక రకాల ఉత్పత్తుల నకిలీకి ఢిల్లీ కేంద్రంగా..
కానీ నేడు అక్కడ నుంచి వచ్చే సరుకంతా నకిలీదిగా వుంటోందని పోలీసులకు అందుతున్న ఫిర్యాదులు చెబుతున్నాయి. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల (Branded companies) దుస్తుల ఉత్పత్తులు మొదలుకొని విద్యుత్ ఉపకరణాలు, సిగరెట్లు, గృహోపక రణాలు, ఆహార వస్తువులు ఇలా అనేక రకాల ఉత్పత్తుల నకిలీకి ఢిల్లీ కేంద్రంగా మారడం ఇప్పుడు హాట్ టాఫిక్గా మారింది. హైదరాబాద్లోని కోరి, బేగంబజార్ సహా అనేక ప్రాంతాలలో నగర పోలీసులతో పాటు ఢిల్లీ పోలీసులు బడా కంపెనీల ప్రతినిధులతో కలిసి నకిలీ ఉత్పత్తులను అమ్మేవారి కోసం తరచూ సోదాలు జరుపుతున్నారంటే వీటి చలామణి మార్కెట్లో ఏస్థాయిలో వుండో ఊహించుకోవచ్చు.
ఒక్క హైదరాబాద్ కాదు దేశంలోని అన్ని ప్రముఖ నగరాలలోనూ ఇదే తరహాలో నకిలీలు రాజ్యమేలుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాలంలో నకిలీ ఉత్పత్తుల వెల్లువలో ఎ క్కువగా పట్టు బడుతున్నవి నకిలీ విద్యుత్ ఉపకరణాలు, దుస్తులు, నూనెలు, సబ్బులు, ఆహార వస్తువులతో పాటు ఖరీదైన విదేశీ సిగరెట్ల పేరిట న కిలీ, నాసిరకం సిగరెట్లు, నికోటిన్ సహా ప్రమానకర రసాయనాలతో తయారపుతున్న ఈ.. సిగరెట్లు వుంటున్నాయి.

ఇతర వస్తువుల విషయం ఎలావున్నా ఆహార వస్తువులతో పాటు నకిలీ సిగరెట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటిని చలామణి చేస్తున్న నేరగాళ్లు ఆరోగ్యంతో ఆటచాడుకుంటున్నారు. ముఖ్యంగా గడచిన రెండేళ్ల కాలంలో నకిలీ విదేశీ సిగరెట్లు, నకిలీ ఈ. సిగరెట్ల వరుసగా పట్టుబడుతుండడం గమనార్హం. భారత్లో సిగరెట్ ప్రియులకు కొదవలేదన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇందులో విదేశీ సిగరెట్లు అంటే మోజుపడే వారు మరింత మంది వుండేది విదితమే. సదిగ్గా ఈ అంశాన్ని సొమ్ము చేసుకుంటున్న స్మగ్లర్లు బీడీల తయారీలో వాడే నాసికరం పొగా కుదు వాడుతూ అందులో కొంత రంగు, వాసన కలిపి విదేశీ సిగరెట్ల మాదిరిగా చక్కగా ప్యాకింగ్ చేస్తూ వాటిని అనేక నగరాలలోని ఇష్టారాజ్యం గా పంపిణీ చేస్తున్నారు.
పట్టుమని అర్ధ రూపాయి కూడా ఖరీదు చేయని నకిలీ సిగరెట్లు డీలర్లకు రెండు రూపాయల నుంచి మూడు రూపాయలకు ఇస్తున్నారు. వీటిని కొంటున్న వ్యాపారులు 25 రూపాయల నుంచి 40 రూపాయల వరకు అమ్ముతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. విదేశీ సి గరెట్ల పేరిట దమ్ము వీలుస్తూ రంగు రంగులుగా పొగ వదులుతున్న పొగరాయుళ్లు తాము తాగేది నకిలీ సిగరెట్ అనేది తెలియక తమ ఆరోగ్యాన్ని తామే పాడు చేసుకుం టున్నారు. సాధారణంగా విదేశీ సిగరెట్లు అంటే ఫారస్, బ్రిటీష్, జర్మనీ దేశాల సరుకుకు బాగా డిమాండ్ వుంటుంది. ఇదే క్రమంలో కల్తీ సరుకును తయారుచేస్తున్న స్మగ్లర్లు సిగరెట్ ప్రియుళ్ల ఆరోగ్యాన్ని హరిస్తున్నారు.
నగరాలలో నకిలీ సిగరెట్ల అమ్మకాలపై
ఇదిలా వుండగా కల్తీ ఆహార వస్తువులతో పాటు నకిలీ సిగరెట్లతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహార వస్తువుల తయార్, విక్రయాల విషయంలో సర్కారీ విభాగాలు కరెనంగా వుండాలని వారంటున్నారు. ఇదే సమయంలో నకిలీ సిగరెట్ల క్రయవిక్రయాల లోనూ ఇదేరీతిన వుండాలని వారు చెబుతున్నారు. సిగరెట్ పీల్చడమే ప్రమాదకరం అయినపుడు నక్కి సిగరెట్ మరింత ప్రమాదకరమని క్యాన్సర్ ఆసత్రి వైద్యులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని నగరాలలో నకిలీ సిగరెట్ల అమ్మకాలపై తమకు సమాచారం వుందని, ఈ విషయంలో ఆయా ప్రాంతాల పోలీసులతోపాటు పౌర విభాగాల అధికారులు కఠినంగా వ్యవహరించాలని వారు కోరుతున్నారు. కల్తీ సిగరెట్ల వాడకం వల్ల నోటి క్యాన్సర్, గుండె క్యాన్సర్, రక్త క్యాన్చర్పంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశాలు. న్నాయని వారంటున్నారు. సిగరెట్లు వాడు తున్న వారు క్యాన్సర్ వారినపడుతూ నిత్యం తమ వద్దకు వస్తున్నారని, ఇందులో నకిలీ సిగరెట్ల వారిన పడ్డ వారు కూడా వున్నారని వైద్య నిపుణులు తెలిపారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :