ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ మిత్రబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం పాకిస్తాన్ కు ఏమాత్రం గిట్టడం లేదు. పాక్, ఆఫ్ఘన్ లమధ్య జరిగిన యుద్ధానికి కారణం కూడా భారత్ అని పాక్ నిందిస్తున్నది. ఆమధ్యకాలంలో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి భారత్ ను సందర్శించారు. ఇప్పుడు మరో మంత్రి కూడా భారత్కు వచ్చారు. దీంతో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు నెమ్మదిగా బలపడుతున్నాయి.
Read Also: Piracy Case:పైరసీ కేసు ఐ-బొమ్మ రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు

ఇటీవల, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ (Aamir Khan Muttakhi) భారత్ లో కొన్ని రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. అయితే, ఈ పరిణామాలను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. భారత్ పర్యటను ముత్తాఖీ వచ్చిన రోజే కాబూల్ పై వైమానిక దాడికి తెగబడింది. ఇప్పుడు తాలిబన్ మరో మంత్రి భారత పర్యటనకు వచ్చారు.
ఆఫ్ఘనిస్తాన్ పరిశ్రమ, వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ రోజుల పర్యటన కోసం బుధవారం న్యూఢిల్లీకి (New Delhi) చేరుకున్నారు. ఈ పర్యటన తర్వాత భారత్, తాలిబాన్ మధ్య బలమైన దైత్య, ఆర్థిక ఒప్పందాల్లో ఒకటిగా ఉండబోతోంది. పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో, సరిహద్దుల్ని పదేపదే మూసేయడంతో ఆఫ్ఘనిస్తాన్ పై వాణిజ్య ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తో వాణిజ్య సంబంధాలు ఈ సమస్యకు పరిష్కారంగా ఉంటాయని తాలిబాన్లు భావిస్తున్నారు.
స్వాగతం పలికిన విదేశాంగ మంత్రిత్వ శాఖ
కాబూల్ నుంచి వచ్చిన మంత్రిని నిన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆనంద్ ప్రకాష్ విమానాశ్రయంలో స్వాగతించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మెరుగుపరచడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఆఫ్ఘాన్ డ్రైఫ్రూట్స్, కార్పెట్స్, రత్నాలు, హస్తకళల రంగాలను భారతమార్కెట్ లోకి విస్తరించాలని తాలిబాన్ ప్రభుత్వం భావిస్తోంది. పాకిస్తాన్ ను తప్పించి ప్రత్యామ్నాయ వాణిజ్య కారిడార్ ను ఏర్పాటు చేయాలని రెండు దేశాలు భావిస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: