నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యొక్క విభాగమైన NPCI Bharat BillPay, ఆన్‌లైన్ బిల్లుల(Net Banking) చెల్లింపులను మరింత సులభం, సురక్షితంగా చేసేందుకు కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీనివల్ల నెట్ బ్యాంకింగ్ విధానంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. NPCI Bharat BillPay లక్ష్యం రాబోయే మూడు-నాలుగు సంవత్సరాల్లో నెలవారీ లావాదేవీల సంఖ్యను ప్రస్తుత 260 మిలియన్ల నుండి 1 బిలియన్ల (100 కోట్ల)కు పెంచి, దేశంలోని సగం కుటుంబాలను చేరుకోవడం. ప్రతి కుటుంబం నుంచి సుమారు మూడు బిల్లుల లావాదేవీలను ప్రాసెస్ చేయాలని నిర్ణయించబడింది అని మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ నూపుర్ చతుర్వేది తెలిపారు.
Read also: కొంపముంచిన యూట్యూబ్ ఇంటర్వ్యూ..మాజీ మావోయిస్టు సిద్ధన్న హత్య

బ్యాంకింగ్ కనెక్ట్
NPCI Bharat BillPay, (BBPS)భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ కోసం “Banking Connect” అనే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ ఏకీకృత(Net Banking) డిజిటల్(Digital) బిల్ చెల్లింపు విధానం, వినియోగదారులకు ఆన్‌లైన్ చెల్లింపులను సులభంగా, భద్రతతో పూర్తి చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. గ్లోబల్ ఫిన్‌టెక్ సమ్మిట్‌లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ద్వారా దీన్ని ప్రారంభించారు.
కొత్త వ్యవస్థలో మార్పులు
- డైరెక్ట్ యాప్ రీడైరెక్ట్: వినియోగదారులు నేరుగా తమ బ్యాంక్ యాప్‌కి వెళ్లి చెల్లింపులు చేయవచ్చు, ఐడీ-పాస్‌వర్డ్ మర్చిపోవడం వల్ల ఏర్పడే సమస్యలు తగ్గుతాయి.
- QR కోడ్ చెల్లింపులు: లావాదేవీ సమయంలో డైనమిక్ QR కోడ్ రూపొందించబడుతుంది. వినియోగదారులు తమ బ్యాంక్ యాప్‌లో స్కాన్ చేసి చెల్లింపును పూర్తి చేయవచ్చు.
- మొబైల్-ఫస్ట్ విధానం: స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని దృష్టిలో ఉంచి, మొత్తం వ్యవస్థ మొబైల్-ఫస్ట్ విధానంలో రూపకల్పన చేయబడింది.
- AI & ML భద్రతా వ్యవస్థ: మోసాలను గుర్తించడానికి మరియు బ్యాంకుకు సమాచారం పంపడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగించారు.
అమలు మరియు భాగస్వాములు
ఈ కొత్త విధానం ఇప్పటికే HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, SBI, YES బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు, అలాగే PayU, Razorpay, Cashfree వంటి చెల్లింపు అగ్రిగేటర్లు అమలు చేస్తున్నారు.
లాభాలు
నెట్ బ్యాంకింగ్ వినియోగదారులకు మూడు ఎంపికలు బ్యాంక్ యాప్ ద్వారా చెల్లించడం, QR కోడ్ స్కాన్ చేయడం, లేదా ప్రస్తుత నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ ఉపయోగించడం. NPCI Bharat BillPay సీఈఓ ప్రకారం, ఈ కొత్త విధానం పారదర్శకత (Transparency) ను పెంపొందించడానికి, ఫిర్యాదులు, ఛార్జ్‌బ్యాక్ కాలపరిమితులు, మరియు మర్చంట్ సెటిల్‌మెంట్ వివరాలను సులభంగా పొందడానికి సహాయపడుతుంది. మొత్తం పేమెంట్ వ్యవస్థకు ఇది మేలు చేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: