Einstein letters : దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన చారిత్రక లేఖలు, పత్రాలపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పత్రాలు ఏ ఒక్క కుటుంబానికి చెందిన వ్యక్తిగత ఆస్తి కాదని, దేశ చరిత్రకు చెందిన వారసత్వ సంపదగా భావించాలని స్పష్టం చేసింది.
1971లో ఇందిరా గాంధీ భద్రత కోసమని నెహ్రూ వ్యక్తిగత లేఖలు, కార్టూన్లు, ఇతర పత్రాలను అప్పటి నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించారు. అయితే 2008లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో, సోనియా గాంధీ ఆదేశాల మేరకు దాదాపు 51 పెట్టెలలో ఉన్న ఈ పత్రాలను ఆమె నివాసానికి తరలించినట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది.
ఈ లేఖల్లో ఎడ్వినా మౌంట్‌బాటన్, శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, సామాజిక నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ వంటి ప్రముఖులతో నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయని సమాచారం. ఇవి వ్యక్తిగత లేఖలైనా, నెహ్రూ ప్రధాని హోదాలో ఉండి రాయడం వల్ల దేశ భద్రత, చరిత్ర పరంగా అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.
Read Also: Sobhita Dhulipala: నాగచైతన్య–శోభిత దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా?
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, ఒకసారి ప్రభుత్వ సంస్థకు అప్పగించిన పత్రాలను తిరిగి తీసుకోవడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఈ పత్రాలు పరిశోధకులు, చరిత్రకారులకు అందుబాటులో ఉండాలని, (Einstein letters) కానీ ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయో స్పష్టత లేదని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటీవల పార్లమెంటులో ఈ అంశంపై చర్చ జరగగా, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పత్రాలు “మిస్సింగ్” అన్న వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం బదులిస్తూ, పత్రాలు కనబడకుండా పోయినవి కాదని, అవి సోనియా గాంధీ వద్దే ఉన్నాయని, వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతున్నామని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ’ (PMML)గా మారిన సంస్థ ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈ పత్రాలను తిరిగి అప్పగించాలని లేఖలు రాసినట్లు సమాచారం. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: