దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET PG, MDS–2026 ఎగ్జామినేషన్ షెడ్యూల్‌ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అధికారికంగా విడుదల చేసింది. ఇది ప్రతి ఏడాది భారతదేశంలోని మెడికల్ విద్యార్థులకు అత్యంత ముఖ్యమైన పరీక్షల్లో ఒకటి. పీజీ కోర్సుల ప్రవేశానికి సంబంధించిన ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడం వలన అభ్యర్థులకు తమ ప్రిపరేషన్‌ను సకాలంలో ప్లాన్ చేసుకునే అవకాశం లభించింది.
Read Also: CSL Jobs: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 260 వర్క్‌మెన్ పోస్టులకు దరఖాస్తులు

షెడ్యూల్ ఇదే
ఈ షెడ్యూల్ ప్రకారం నీట్ ఎమ్‌డీఎస్ పరీక్ష మే 2, 2026వ తేదీన జరగనుంది. ఇక ఆగస్టు 30వ తేదీన నీట్ పీజీ 2026 (NEET PG 2026) పరీక్ష దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌బీఈఎంఎస్ వెల్లడించింది.ఇక నీట్ పీజీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయవల్సిన కటాఫ్ తేదీలను కూడా ఎన్‌బీఈఎంఎస్ వెల్లడించింది.
నీట్ ఎమ్‌డీఎస్‌కు హాజరయ్యే అభ్యర్ధులు ఇంటర్న్‌షిప్ మే 31, 2026వ తేదీలోపు పూర్తి చేయవల్సి ఉంటుంది. ఇక నీట్ పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు సెప్టెంబర్ 30, 2026వ తేదీలోపు తమ ఇంటర్న్‌షిప్‌లను పూర్తి చేయవల్సి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: