వైద్య పీజీ కోర్సులకు ప్రవేశానికి నిర్వహించే నీట్ పీజీ 2025 (NEET PG 2025) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఎన్‌బీఈఎంఎస్ కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులు తమ పరీక్షా నగరాలను పునఃసమర్పించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ప్రత్యేక విండో తెరిచింది.ఈ రీ-సబ్మిషన్ ప్రక్రియ జూన్ 13 మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైంది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల నేపథ్యంలో పరీక్ష తేదీని ఆగస్టు 3కు మార్చినట్లు ఎన్బీఈఎంఎస్ ప్రకటించింది.
పరీక్షా కేంద్రాల సంఖ్య పెంపు
అభ్యర్థుల సౌకర్యం దృష్టిలో పెట్టుకుని, పరీక్షా కేంద్రాల సంఖ్యను 233 నగరాలకు పెంచారు. పరీక్షను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.పరీక్ష నగర ఎంపికకు జూన్ 17 వరకూ గడువు ఉంది. అభ్యర్థులు (natboard.edu.in) వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమకు అనుకూల నగరాలను ఎంచుకోవచ్చు.పరీక్ష నగరాల కేటాయింపు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ఉంటుంది. ముందుగా ఎంపిక చేసుకున్నవారికి ఆ ప్రాధాన్యత కేటాయించే అవకాశం ఉంటుంది.
కీలక తేదీలపై పూర్తి సమాచారం
రీ-సబ్మిషన్ చివరి తేదీ: జూన్ 17
ఎడిట్ విండో: జూన్ 20 – జూన్ 22
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: జులై 31
పరీక్ష తేదీ: ఆగస్టు 3 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
ఫలితాల విడుదల: సెప్టెంబర్ 3
నగర ఎంపిక దశలివే
natboard.edu.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి
‘NEET PG 2025’ విభాగాన్ని క్లిక్ చేయాలి
యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి
‘Exam City Selection’ లింక్‌పై క్లిక్ చేయాలి
నగరాల జాబితాలో నుంచి ప్రాధాన్యతలు ఎంచుకోవాలి
ఎంపికను ధృవీకరించి సమర్పించాలి
ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్ చూడండి
పరీక్షకు సంబంధించి తాజా అప్డేట్స్ కోసం, అభ్యర్థులు ఎన్‌బీఈఎంఎస్ వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా చెక్ చేయాలని సూచించారు.
Read Also : Helicopter : ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్