ఇటీవల బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుటుంబానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన నితీష్ కుమార్ సర్కార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లాలూకు షాక్ ఇచ్చింది. బీహార్ మాజీ సీఎంగా పనిచేసిన రబ్రీదేవికి (Rabri devi) ప్రభుత్వం కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది.
Read Also: Kamala Pasand owner: పాన్ మసాలా యజమాని కోడలు దీప్తి ఆత్మహత్య

దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా లాలూ కుటుంబానికి అయ్యింది. గత 20 ఏళ్లుగా లాలూ కుటుంబానికి ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయమనడంతో వారు ఖంగుతిన్నారు.
పార్టీ ఓటమి నుంచి తేరుకోకముందే షాక్
ఎన్నికల్లో ఆర్జేడీ (RJD) ఘోరంగా ఓడిపోయింది. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎంతో ధీమాతో ఉన్న లాలూ కుటుంబం ఓటమి పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా బంగ్లాను ఖాళీ చేయాలని భవన నిర్మాణ శాఖ మాజీ సీఎం రబ్రీదేవికి నోటీసులు జారీ చేసింది. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లాలూ కుటుంబంలో ఉన్న గొడవలే పార్టీ ఓటమికి ఓ కారణమని పార్టీశ్రేణులు అనుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: