ఒడిశా చరిత్రలో కీలకంగా భావించే పైకా తిరుగుబాటు (Paika Rebellion) కు సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచి సంబంధిత పాఠ్యాంశాన్ని తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik)ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ,“పైకా తిరుగుబాటు భారత స్వాతంత్ర్య పోరాటంలో తొలి ప్రజా పోరాటంగా గుర్తించబడింది. దేశ చరిత్రలో ఇదో కీలక ఘట్టం. దీనిని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడం అనేది ప్రజల స్మృతి నుండి పోరాటాల చరిత్రను తొలగించడమే,” అని వ్యాఖ్యానించారు.

చరిత్రలో అదో కీలక ఘట్టం
ఒడిశా వీరత్వానికి చిహ్నమైన ఆ తిరుగుబాటు గురించి పుస్తకాల్లో లేకుండా చేశారని నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) ఆరోపించారు. పైకా తిరుగుబాటు లేదా పైకా విద్రోం గురించి పాఠ్యాన్ని ఎన్సీఈఆర్టీ తొలగించిందని, ఒడిశా చరిత్రలో అదో కీలక ఘట్టం అని, కానీ ఆ అంశాన్ని పాఠ్య పుస్తకాల నుంచి తొలగించడం సమంజసం కాదు అని పట్నాయక్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాశారు. 1817లో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పైకా తిరుగుబాటు జరిగింది. సిపాయి ముట్నీకి 40 ఏళ్ల క్రితమే పైకా తిరుగుబాటు జరిగిందని, ఈ పాఠాన్ని టెక్ట్స్ బుక్స్ నుంచి ఎందుకు తీసి వేశారని ఆయన ప్రశ్నించారు. ఆ యోధులను అగౌరవపరచడమే అవుతుందన్నారు. పైకా తిరుగుబాటుదారుల పాఠ్యాంశాన్ని పునర్ పరిశీలించాలని ఒడిశా సీఎంను, కేంద్ర విద్యాశాఖ మంత్రిని కోరుతున్నట్లు మాజీ సీఎం పట్నాయక్ (Naveen Patnaik)తెలిపారు.
నవీన్ పట్నాయక్ అర్హతలు?
పాఠశాల విద్య తర్వాత, అతను ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాలకు వెళ్లి, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందాడు.
ఒడిశా సీఎం ఎందుకు రాజీనామా చేశారు?
రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత, ఒడిశా ముఖ్యమంత్రి మరియు బిజెడి చీఫ్ నవీన్ పట్నాయక్ 24 సంవత్సరాల పదవీకాలం ముగిసింది, బుధవారం భువనేశ్వర్‌లోని రాజ్ భవన్‌లో గవర్నర్ రఘుబర్ దాస్‌కు రాజీనామా సమర్పించారు.
సీఎం రాజీనామా చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు?
సాధారణ ఎన్నికల తర్వాత లేదా అసెంబ్లీ మెజారిటీ పరివర్తన దశలో ముఖ్యమంత్రి రాజీనామా చేసిన సందర్భంలో, గవర్నర్ కొత్త ముఖ్యమంత్రిని నియమించే వరకు లేదా అసెంబ్లీని రద్దు చేసే వరకు పదవీ విరమణ చేసే ముఖ్యమంత్రి అనధికారికంగా “కేర్ టేకర్” ముఖ్యమంత్రి బిరుదును కలిగి ఉంటారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: IMF: ఐఎంఎఫ్ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్