ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ : రాహుల్,(Rahul Gandhi) సోనియాపై కక్ష్ సాధింపుగా ఇడి కేసు నమోదు చేసిందని(National Herald) భువనగిరి ఎంపి చామల కిరణ్కుమార్ రెడ్డి ఆరోపించారు. న్యూఢిల్లీలో ఆయన విలేఖరులతో -మాట్లాడతూ నేషనల్ హెరాల్డ్ కేసులో పోలీస్, ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసిందని తెలిపారు. ఈ కేసులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని కోర్టు ధృవీకరించిందని ఆయన చెప్పారు. బలమైన ప్రతిపక్ష నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడానికే కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ బిజెపి పాలకులపై కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: BRS: బిఆర్ఎస్ఎల్పీ సమావేశం 21కి వాయిదా

ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపుపై చామల ఆగ్రహం
ఉపాధిహామి పథకంకు మహాత్మా గాంధీ(National Herald) పేరు తొలగించి విబిజిరామ్ జిగా మార్చడం ఆర్ఎస్ఎస్ బిజెపి సంకుచిత ఆలోచన విదానంకు రుజవంటూ దుయ్యబట్టారు. మహాత్మాగాంధీ పేరును చరిత్ర నుంచి తొలగించాలన్న ఉద్దేశంతోపాటు ఈ పథకాన్ని బలహీనపరిచి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై చామల ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర రాష్ట్ర నిధుల వాటా 40:60గా మార్చడంతో రాష్ట్రాలపై భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో నిధులు లేకపోతే పథకం అమలు కష్టమయ్యే పరిస్థితి ఉందన్నారు. 125 రోజులు అంటూనే ఉపాధి హామీని అస్పష్టంగా మార్చారంటూ కేంద్రంపై ఆవేదన వ్యక్తం చేశారు. పథకానికి దేవుడి పేరు. పెట్టి ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కేంద్రం తీరును తప్పుపట్టారు. ఈ పథకం పేరుతోపాటు అమలులో తీసుకు వచ్చిన మార్పులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ దిగుతుందని ఎంపీ చామల స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో 2005లో ఉపాధి హామీ పథకం ప్రారంభమైందని గుర్తు చేశారు. గ్రామీణ పేద ప్రజలకు 100 రోజుల గ్యారెంటీ ఉపాధి కల్పించాలనే లక్ష ్యంతో అప్పటి కేంద్రం 100శాతం కేటాయించాలని నిధులు కేటాయించిందని రెడ్డి గుర్తు అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: