‘ధురంధర్’ సినిమా నటుడు నదీమ్ ఖాన్ (Nadeem Khan), ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు..
పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వెర్సోవాలోని ఆయన నివాసంలో నదీమ్ ను ఈ నెల 22న అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కస్టడీలో ఉంచి విచారిస్తున్నట్లు తెలిపారు. కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
Read Also: Prabhas: ఓటీటీలోకి రాజా సాబ్.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ వివరాలు?

పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
బాధిత మహిళ ఫిర్యాదు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని మాల్వానీకి చెందిన మహిళ పలువురు సినీ ప్రముఖుల ఇళ్లల్లో పనిచేసింది.ఆయా ప్రముఖుల ఇంటికి రాకపోకలు సాగించిన నదీమ్ ఖాన్ తో పరిచయం అయ్యాక వెర్సోవాలోని ఆయన నివాసంలో పనికి కుదిరింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి నదీమ్ (Nadeem Khan) తనతో సాన్నిహిత్యం పెంచుకున్నాడని,
పలుమార్లు తనపై అఘాయిత్యం చేశాడని ఆరోపించింది. పదేళ్లుగా తనతో సంబంధం కొనసాగించిన నదీమ్.. పెళ్లి చేసుకొమ్మని అడిగిన ప్రతిసారీ వాయిదా వేసేవాడని చెప్పింది. ఇటీవల గట్టిగా పట్టుబట్టడంతో పెళ్లికి నిరాకరించాడని ఆరోపించింది. దీంతో న్యాయం కోసం తాను పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: